loader

రైతులకు రుణాలు… ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 231వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఖరీఫ్‌లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయిందని… ఈ పాటికే రైతులకు రుణాలు, ఇన్ పుట్ ఇవ్వాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీజన్ ఆఖరులో రుణాలు ఇవ్వటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పుకొచ్చారు. సీజన్ ముగింపులో కాకుండా ముందుగానే రైతులకు రుణాలు, వ్యవసాయ ఇన్‌పుట్‌లను అందించడం చాలా అవసరమని చెప్పారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్లు వారి తీరు మార్చుకోవాల్సి […]

8 ఏళ్లుగా చిక్కకుండా తిరుగుతున్న ముఠా.. ఎట్టకేలకు చెక్‌పెట్టిన పోలీసులు

రోడ్లపై పక్కన పొదల్లో దాక్కొని.. అటుగా వెళ్లే జనాలపై దాడులకు పాల్పడుతూ బంగారం, డబ్బు దోచుకుంటూ.. జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఓ దోపిడి ముఠాకు నంద్యాల పోలీసులు చెక్‌పెట్టారు. పాణ్యంలోని పిన్నాపురం కొండల్లో నలుగురు దారిదోపిడి దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 10.35 లక్షల విలువగల బంగారు, వెండి నగలను నాలుగు పిడిబాకులు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది సంవత్సరాల కాలంగా నంద్యాల, కర్నూలు, గుంటూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో పలు చోరిలకు […]

గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం.. ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది.  గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 28వ తేదీ లోపు గ్రామ పంచాయతీల ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ చేసి గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శించాలని ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

వినాయక చవితి పండుగ శుభ ముహూర్తం ఇదే !!

ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్థి రోజున గణేష్‌ చతుర్థని ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది 2025లో ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి పండుగ జరగనుంది. అయితే చతుర్థి తిథి ఆగస్టు 26న మధ్యాహ్నం 1:54 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 27న మధ్యాహ్నం 3:44 గంటలకు ముగుస్తుంది. ఈక్రమంలో పండితుల సూచన ప్రకారం ఆగస్టు 27న ఉదయం 11:47 గంటల నుంచి మధ్యాహ్నం 1:41 గంటల వరకు వినాయక విగ్రహ ప్రతిష్ఠ, పూజలకు అత్యంత శుభ ముహూర్తంగా […]

విశాఖలో మరో రెండు యుద్ధ నౌకలు జాతికి అంకితం చేసిన రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

భారత నావికాదళంలో మరో రెండు అధునాతన స్టెల్త్ గైడెడ్ క్షిపణి యుద్ధనౌకలు చేరాయి. మంగళవారం విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఉదయగిరి, హిమగిరి యుద్ధనౌకలను అధికారికంగా నావికాదళంలో చేర్చారు. రెండు నౌకలు ఒకేసారి జాతికి అంకితం చేయడం ఇదే తొలిసారి. ఉదయగిరి, హిమగిరి ‘ప్రాజెక్ట్ 17 (శివాలిక్)’ తరగతి నౌకల కొత్త వెర్షన్లు. వీటిలో స్టెల్త్ అంటే రాడార్ నుండి తప్పించుకోగల సామర్థ్యం, ఆయుధం, సెన్సార్ వ్యవస్థలలో గణనీయమైన మెరుగుద ఉన్నాయి.

హైదరాబాద్ మహీంద్రా వర్సిటీలో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లా సూరారంలో ఉన్న మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ వాడకం వ్యవహారం కలకలం సృష్టించింది. ఈగల్ టీమ్ నిర్వహించిన దర్యాప్తులో దాదాపు 50 మంది విద్యార్థులు మాదకద్రవ్యాలు సేవిస్తున్నట్లు గుర్తించారు. విద్యార్థులకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.వారిలో ఇద్దరు ఇదే విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు కావడం గమనార్హం. అరెస్టు చేసిన నిందితుల నుంచి పోలీసులు 1.15 కేజీల గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్ (OG Weed) స్వాధీనం చేసుకున్నారు.

బీహార్ గ్రామాల్లో రేవంత్ రెడ్డిని కర్రలతో ఉరికించి కొడతారు: ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జన్ సురాజ్ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఎవరు?, బీహార్‌లో ఆయన హోదా ఏమిటి? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గతంలో బీహార్ ప్రజలను అవమానించారని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. బీహార్‌ను అవమానించే నాయకులతో తిరుగుతున్న రాహుల్ గాంధీ మనస్తత్వాన్ని ఇది ప్రతిబింబిస్తుందని ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి బీహార్‌లోని ఏ గ్రామానికి వెళ్లినా, ప్రజలు కర్రలతో తరిమి కొడతారని హెచ్చరించారు.

కశ్మీర్‌లో వరదలు బీభత్సం.. వైష్ణోదేవి మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు

భారీ వర్షాలకు జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో పలు నదులు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో క్లౌడ్‌బరస్ట్‌ కారణంగా నలుగురు, వైష్ణోదేవి కాట్రా మార్గంలో ఐదుగురు సహా 9 మంది మృతి చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. భారీ వర్షాలు కారణంగా రాంబన్ జిల్లాలోని కొండచరియలు విరిగిపడి జనజీవనం స్తంభించింది. వరదలకు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపేశారు.

కష్టపడి చదివి టీచర్ జాబ్ కొట్టాడు.. 3 రోజుల్లో సర్టిఫికట్ వెరిఫికేషన్ ఉండగా

నంద్యాల జిల్లా అవుకు మండలం చెర్లోపల్లెలో నిరుద్యోగి మధు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫ్రిజ్ పక్కన ఉంచిన అతని ఒరిజినల్ సర్టిఫికెట్లు మంటల్లో దగ్ధమయ్యాయి. తాజా డీఎస్సీ ఫలితాల్లో మధు ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. SGT విభాగంలో 80.53 మార్కులు సాధించి.. నంద్యాల జిల్లా స్థాయిలో 773వ ర్యాంక్‌ సాధించారు. ఇంకో మూడు రోజుల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని అధికారుల నుంచి సమాచారం రావడంతో మధు ఆందోళన చెందుతున్నారు.

యూరియా బస్తాల కోసం రైతుల ఎదురుచూపులు

తెలంగాణ రాష్ట్రంలో యూరియా ఎరువుల కొరత తీవ్రమవుతోంది. రైతులు తమ పంటలకు అవసరమైన యూరియాను సకాలంలో పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా శివంపేట, నల్లగొండ జిల్లా అనుముల మండలం వంటి ప్రాంతాలలో రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముందు గంటల తరబడి క్యూలలో నిలబడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. చిన్న పిల్లలతో తల్లులు కూడా ఈ క్యూలలో ఉన్నారు.ప్రభుత్వం యూరియాను సమృద్ధిగా అందించేలా చర్యలు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON