హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లా సూరారంలో ఉన్న మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ వాడకం వ్యవహారం కలకలం సృష్టించింది. ఈగల్ టీమ్ నిర్వహించిన దర్యాప్తులో దాదాపు 50 మంది విద్యార్థులు మాదకద్రవ్యాలు సేవిస్తున్నట్లు గుర్తించారు. విద్యార్థులకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.వారిలో ఇద్దరు ఇదే విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు కావడం గమనార్హం. అరెస్టు చేసిన నిందితుల నుంచి పోలీసులు 1.15 కేజీల గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్ (OG Weed) స్వాధీనం చేసుకున్నారు.

