నంద్యాల జిల్లా అవుకు మండలం చెర్లోపల్లెలో నిరుద్యోగి మధు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫ్రిజ్ పక్కన ఉంచిన అతని ఒరిజినల్ సర్టిఫికెట్లు మంటల్లో దగ్ధమయ్యాయి. తాజా డీఎస్సీ ఫలితాల్లో
మధు ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. SGT విభాగంలో 80.53 మార్కులు సాధించి.. నంద్యాల జిల్లా స్థాయిలో 773వ ర్యాంక్ సాధించారు. ఇంకో మూడు రోజుల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని అధికారుల నుంచి సమాచారం రావడంతో మధు ఆందోళన చెందుతున్నారు.

