రోడ్లపై పక్కన పొదల్లో దాక్కొని.. అటుగా వెళ్లే జనాలపై దాడులకు పాల్పడుతూ బంగారం, డబ్బు దోచుకుంటూ.. జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఓ దోపిడి ముఠాకు నంద్యాల పోలీసులు చెక్‌పెట్టారు. పాణ్యంలోని పిన్నాపురం కొండల్లో నలుగురు దారిదోపిడి దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 10.35 లక్షల విలువగల బంగారు, వెండి నగలను నాలుగు పిడిబాకులు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది సంవత్సరాల కాలంగా నంద్యాల, కర్నూలు, గుంటూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో పలు చోరిలకు పాల్పడుతూ.. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు.

