సీఎం చంద్రబాబు అధ్యక్షతన 231వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఖరీఫ్‌లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయిందని… ఈ పాటికే రైతులకు రుణాలు, ఇన్ పుట్ ఇవ్వాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీజన్ ఆఖరులో రుణాలు ఇవ్వటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పుకొచ్చారు. సీజన్ ముగింపులో కాకుండా ముందుగానే రైతులకు రుణాలు, వ్యవసాయ ఇన్‌పుట్‌లను అందించడం చాలా అవసరమని చెప్పారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్లు వారి తీరు మార్చుకోవాల్సి ఉందన్నారు.

