loader

టెంపుల్ టూరిజంగా ఒంటిమిట్ట.. రామరాజ్యం తేవాలన్నదే నా ఆకాంక్షః సీఎం చంద్రబాబు

ఒంటిమిట్టను టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక్కడికి వచ్చే భక్తులు రెండు మూడు రోజులు ఉండేలా సకల సదుపాయాలు కల్పిస్తామన్నారు. కడప జిల్లా, ఒంటిమిట్టలో జరిగిన శ్రీసీతారాముల కళ్యాణోత్సవంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొని స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు.  కన్నుల పండువగా ఒంటిమిట్ట సీతారాముల వారి కళ్యాణానికి భక్తులు తరలివచ్చారు. అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా కళ్యాణోత్సవం జరిగింది.

టెట్ నోటిఫికేషన్ విడుదల

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టిజి టెట్ 2025) నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఏప్రిల్ 15 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. పాఠశాల విద్యా అధికారిక వెబ్ సైట్ http:// schooledu.telanganga.gov.inలో మరింత సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు.

ప్రముఖ కంపెనీ కాంపా బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్..

ప్రముఖ బేవరేజెస్ బ్రాండ్ కాంపా (Campa), తన కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను (Ram Charan) పేరును ప్రకటించింది. ఈ భాగస్వామ్యంతో, బ్రాండ్ ఒక ఉత్తేజకరమైన కొత్త మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభిస్తోందని రామ్ చరణ్‌తో కొలాబొరేట్ అవ్వడంతో కాంపా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కాంపా బ్రాండ్ మార్చి 2023లో విజయవంతమైన అరంగేట్రంతో ప్రారంభమైంది. మార్కెట్‌లో అతి తక్కువ సమయంలోనే త్వరగా ఊపందుకుంది.

గూగుల్ పే, ఫోన్ పే యూజర్లూ.. QR షేరింగ్‌తో UPI పేమెంట్లు బంద్.

ర్సన్ టూ మెర్చంట్ (P2M) క్యూఆర్ కోడ్ షేర్ అండ్ పే ఆధారిత ఇంటర్నేషనల్ యూపీఐ ట్రాన్సాక్షన్లను ఆపేస్తున్నట్లు ఎన్‌పీసీఐ తెలిపింది. అంటే విదేశాల్లో ఉన్న షాపు లేదా మర్చంట్ వద్ద ఏదైనా కొనుగోలు చేసినప్పుడు వారు మీకు క్యూర్ కోడ్ షేర్ చేస్తారు. దానిని మీరు స్కాన్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇకపై అలా క్యూఆర్ కోడ్ షేర్ చేసి స్కాన్ చేసే ఇంటర్నేషనల్ పేమెంట్లకు అవకాశం ఉండదు. ఏప్రిల్ 4, 2025 […]

నదిలో కూలిన హెలికాప్టర్‌.. సిమెన్స్‌ సీఈవో దుర్మరణం

అమెరికాలోని హడ్సన్‌ నదిలో హెలికాప్టర్‌ కూలిన ప్రమాదంలో టెక్‌ దిగ్గజ కంపెనీ సిమెన్స్‌ సీఈవో అగస్టీన్‌ ఎస్కోబార్‌ దుర్మరణం చెందారు. మన్‌హట్టన్‌-న్యూజెర్సీ మధ్యలో గురువారం మధ్యాహ్నం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ గింగిరాలు కొడుతూ నదిలో కూలిపోయింది. అగస్టీన్‌ కుటుంబ సమేతంగా న్యూయార్క్‌ నగర పర్యటనకు వచ్చినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అగస్టీన్‌ భార్య, ముగ్గురు పిల్లలు, పైలట్‌ కూడా మృతి చెందారు.

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ భేష్‌.. సిబ్బంది సేవల్లో మొదటి స్థానం..

హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకుంది. 2025 సంవత్సరానికి దక్షిణాసియా, భారత్‌లో అత్యుత్తమ విమానాశ్రయ సిబ్బంది సేవ అవార్డును నాలుగోసారి దక్కించుకుంది. వాయు రవాణా రేటింగ్‌ సంస్థ స్కైట్రాక్స్‌ ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్‌పోర్టులను ఎంపిక చేయగా దానిని స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగిన ప్యాసింజర్‌ టెర్మినల్‌ ఎక్స్‌పో 2025లో ప్రకటించి, అందజేశారు. తమకు ఈ అవార్డు రావడం పట్ల జీఎంఆర్‌ యాజమాన్యం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేసింది.

హనుమంతుని జన్మోత్సవం

హనుమంతుని జన్మోత్సవం వైశాఖ శుద్ధ దశమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు

మీ క్యాలెండర్లను మార్క్ చేసుకోండి, దొంగప్ప పురాణం వచ్చేస్తోంది… కన్నప్ప పై మంచు మనోజ్

మనోజ్ మరోసారి కంప్లయింట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో రచ్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ చేసిన ట్వీట్ చర్చకు దారి తీసింది. “మార్క్ యువర్ క్యాలెండర్స్… ద లెజెండ్ ఆఫ్ దొంగప్ప జూన్ 27న బిగ్ స్క్రీన్‌పైకి రాబోతోంది. ఇంతకీ రిలీజ్ జూలై 17నా ? లేదా జూన్ 27నా? 100 కోట్లకు పైగా బడ్జెట్ (80% విస్మిత్ కమిషన్) మూవీ పీఆర్ ప్లానింగ్ కేక” తన సినిమా ‘భైరవం’కు భయపడి ‘కన్నప్ప’ సినిమాను […]

ఆట మొదలుపెట్టిన అమిత్‌షా.. రూట్‌మ్యాప్‌తో అరవ దేశంలోకి..!

తమిళ రాజకీయాలు.. ఎవరికీ అర్థంకాని బ్రహ్మపదార్థం. ఇక్కడ స్థానిక పార్టీలదే ఆధిపత్యం. అందుకే డీఎంకే, అన్నాడీఎంకే.. దశాబ్దాలుగా రాజ్యమేలుతున్నాయి. కానీ ఇప్పుడు, కమలం పార్టీ..అరవ గడ్డపై తన మార్క్ చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. సరికొత్త వ్యూహాలతో పొలిటికల్‌ గేమ్‌ ఆడేందుకు సిద్ధమవుతోంది ఈసారి ఎలాగైనా పాగా వేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో చేసిన తప్పిదాలు చేయకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఏడాదిలోపే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఇప్పట్నుంచే ఆట మొదలుపెట్టింది కాషాయదళం.

హనుమంతుని జన్మోత్సవం

హనుమంతుని జన్మోత్సవం వైశాఖ శుద్ధ దశమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హిందూ పురాణ కధల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON