తెలంగాణ మాజీ డీజీపీ శివధర్ రెడ్డి స్టేట్ సెక్యూరిటీ అడ్వయిజర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, డ్రగ్స్ కట్టడి, రోడ్డు భద్రత వంటి కీలక అంశాల్లో ప్రభుత్వానికి ఆయన సలహాలు, సూచనలు అందజేయనున్నారు. డీజీపీగా పదవీ విరమణ చేసిన వెంటనే కీలక పోస్టులో నియమిస్తూ సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.

