ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం జరిగింది. కదులుతున్న కారులో మంటలు వ్యాపించాయి. దీంతో దాంట్లో ప్రయాణిస్తున్న అయిదుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో జరిగింది.
బుధవారం రాత్రి మౌజ్‌పూర్ వద్ద ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. కారులో ఉన్న ప్రయాణికులు.. వైష్ణవీదేవి ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తున్నారు. మృతిచెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఓ మైనర్ బాలిక, మరొకరు ఉన్నట్లు గుర్తించారు. సీఎన్జీ వాహనం కావడం వల్ల షార్ట్ సర్క్యూట్ కోణంలో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నామన్నారు.

