హైదరాబాద్లోని జీఎంఆర్ ఎయిర్పోర్టు ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకుంది. 2025 సంవత్సరానికి దక్షిణాసియా, భారత్లో అత్యుత్తమ విమానాశ్రయ సిబ్బంది సేవ అవార్డును నాలుగోసారి దక్కించుకుంది. వాయు రవాణా రేటింగ్ సంస్థ స్కైట్రాక్స్ ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్పోర్టులను ఎంపిక చేయగా దానిని స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పో 2025లో ప్రకటించి, అందజేశారు. తమకు ఈ అవార్డు రావడం పట్ల జీఎంఆర్ యాజమాన్యం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేసింది.

