తమిళ రాజకీయాలు.. ఎవరికీ అర్థంకాని బ్రహ్మపదార్థం. ఇక్కడ స్థానిక పార్టీలదే ఆధిపత్యం. అందుకే డీఎంకే, అన్నాడీఎంకే.. దశాబ్దాలుగా రాజ్యమేలుతున్నాయి. కానీ ఇప్పుడు, కమలం పార్టీ..అరవ గడ్డపై తన మార్క్ చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. సరికొత్త వ్యూహాలతో పొలిటికల్ గేమ్ ఆడేందుకు సిద్ధమవుతోంది ఈసారి ఎలాగైనా పాగా వేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో చేసిన తప్పిదాలు చేయకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.
ఏడాదిలోపే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఇప్పట్నుంచే ఆట మొదలుపెట్టింది కాషాయదళం.

