నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని పి వి ఎస్ ఆర్ గోడౌన్ లో వైసిపి నేత శివరామిరెడ్డిను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచారు. ముగ్గురు వ్యక్తులు ముసుగు ధరించి కత్తులతో దాడి చెయ్యడంతో తీవ్రంగా గాయపడ్డాడు. శరీరం మొత్తం రక్తంతో నిండిపోయింది. టిడిపి ఎంఎల్ఎ అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ తనపై దాడి చేశాడని, తనను చంపడానికి వచ్చినట్లు గుర్తించానని బాధితుడు శివరామిరెడ్డి ఆరోపణలు చేశాడు.

