ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో ఇరాన్ దివంగత సుప్రీం అయతొల్లా ఖమేనీ సన్నిహితుడు మహ్మద్ మొక్బర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో చర్చలకు దిగివచ్చే ఉద్దేశం తమకు లేదని తేల్చిచెప్పారు. వీలైనంత కాలం యుద్ధాన్ని కొనసాగిస్తామని ఇరాన్ స్టేట్ అధికారిక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు సహకరించిన ప్రతి ఒక్కరూ ఇరాన్‌కు శత్రువుగానే భావిస్తున్నట్లు ప్రకటించారు. యుద్ధం సమయంలో వారు శత్రువుల వైపు ఉంటారో లేక ఇస్లామిక్ విధానాల వైపు తేల్చుకోవాలని ఘోలామ్ హుస్సేన్ స్పష్టం చేశారు.

