loader

ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు అమెరికాలో అరెస్ట్

విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లు అమెరికాలో అరెస్టయ్యారు. గ్యాంగ్‌స్టర్ వెంకటేశ్ గార్గ్‌ను జార్జియాలోనూ.. కరుడగట్టిన లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు భాను రాణాను అమెరికాలోనూ హర్యానా పోలీసులు సహా భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు. గార్గ్, రాణాలను త్వరలోనే భారత్‌కు తీసుకురానున్నారు. ప్రస్తుతం భారత్‌కు చెందిన రెండు డజన్లకుపైగా గ్యాంగ్‌స్టర్లు విదేశాల్లో ఉంటూ రిక్రూట్‌మెంట్లు, క్రిమినల్ సిండికేట్లను నడుపుతూ తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు.

నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన టర్కీ.

గాజాలో ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా టర్కీ మరో భారీ ముందడుగు వేసింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సహా రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎయాల్ జమీర్ వంటి 37 మంది ఉన్నతాధికారులపై మారణహోం సృష్టించారనే ఆరోపణలతో టర్కీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ)లో కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. .అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం […]

డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ కన్నుమూత

జీవం ఉనికికి కారణమైన జన్యు పదార్థం డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న అమెరికన్ శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ శుక్రవారం తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో 97 వయసులో కన్నుమూశారు.మెలికలు తిరిగిన నిచ్చెన ఆకారంలో ఉన్న డీఎన్ఏ నిర్మాణాన్ని డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అని పిలుస్తారు ఈ అమరికను కనుగొన్నందుకు బ్రిటన్ శాస్త్రవేత్త ఫ్రాంసిస్ క్రిక్‌‌, మారిస్ విల్కిన్స్‌లతో కలిసి జేమ్స్ డీ వాట్సాన్ 1962లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు

అమెరికా వీసా.. డయాబెటిస్‌, ఒబెసిటీ ఉన్నవారికి షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం  ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారిపై దృష్టి సారించింది. ముఖ్యంగా డయాబెటిస్‌, ఒబెసిటీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వీసాలు ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఎంబసీలు మరియు కాన్సులర్‌ కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘‘వలసదారుల ఆరోగ్య పరిస్థితి ప్రభుత్వం మీద ఆర్థిక భారంగా మారకూడదు’’ అనే ఉద్దేశంతోనే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

హెచ్-1బీ వీసాదారులకు కెనడా గుడ్ న్యూస్

హెచ్‌-1బీ వీసాదారుల (H-1B Visa)కు కెనడా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. హెచ్‌-1బీ వీసా ద్వారా అమెరికా వెళ్లాలని కలలు కనే సాంకేతిక నిపుణులను కెనడా వైపు ఆకర్షించడమే లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విదేశాలకు చెందిన వేలాది మంది టాప్ పరిశోధకులు, యునైటెడ్ స్టేట్స్ నుండి H-1B వీసా హోల్డర్ల కోసం కెనడా ప్రత్యేక ప్రవేశ మార్గాలను సృష్టిస్తోంది. ఇదే సమయంలో వచ్చే ఏడాది నుండి భారతీయులు సహా విదేశీ విద్యార్థుల ప్రవేశాలను 25-32 […]

మిస్ యూనివర్స్ పోటీల్లో గందరగోళం..అందాల తారల వాకౌట్

థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న 74వ మిస్ యూనివర్స్ 2025 పోటీలు అరుదైన నిరసన దృశ్యానికి వేదిక అయ్యాయి. ఆతిథ్య దేశానికి చెందిన ఒక ఉన్నతాధికారి.. మిస్ మెక్సికో ఫాతిమా బాష్‌ను బహిరంగంగా అవమానించడంతో దీనికి నిరసనగా పలు దేశాల నుంచి వచ్చిన పోటీదారులు వేదిక నుంచి సామూహికంగా వాకౌట్ చేశారు. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాత్ ఇత్సరక్రిసిల్, మిస్ మెక్సికో ఫాతిమా బాష్ మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

రాహుల్ గాంధీ ఆరోప‌ణ‌ల‌పై రియాక్ట్ అయిన బ్రెజిల్ మోడ‌ల్

హ‌ర్యానాలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  బ్రెజిల్ మోడ‌ల్ పేరుతో 22 ఓట్లు ఉన్నాయ‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు. త‌న‌కు చెందిన 20 ఏళ్ల వ‌య‌సులో ఓ పాత ఫోటోను ఇండియాలో ఓటింగ్ కోసం వాడిన‌ట్లు తెలిసింద‌ని, ప్ర‌జ‌ల్ని మోసం చేసేందుకు త‌న‌ను ఇండియ‌న్‌గా చూపిస్తున్నార‌ని, ఇదేం వెర్రిత‌నం, ఇంత పిచ్చా, మ‌నం ఏం ప్ర‌పంచంలో జీవిస్తున్నాం అని  బ్రెజిల్ మోడ‌ల్ త‌న వీడియోలో పేర్కొన్న‌ది. వాస్త‌వానికి లారిసా నేరి మోడ‌ల్ కాదు. ఆమె సాధార‌ణ మ‌హిళే అని […]

ఫిలిప్పీన్స్​లో ఎమర్జెన్సీ- తుపాను బీభత్సానికి 114 మంది మృతి

ఫిలిప్పీన్స్​లో కల్మేగీ తుపాను బీభత్సం ఇంకా కొనసాగుతోంది. తుపాను కారణంగా సెంట్రల్​ ప్రావిన్స్​లో దాదాపు 114మంది మృతిచెందగా, 127 మంది వరదల్లో గల్లంతైనట్లు ఫిలిప్పీన్స్​ అధ్యక్షుడు ఫెర్డినాండ్​ మార్కోస్​ తెలిపారు. విపత్తుదళ అధికారులతో జరిగిన సమావేశంలో మార్కోస్ తుపాను పరిణామాల గురించి ప్రధానంగా చర్చించారు. అనంతరం దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. సెంట్రల్​ ఫిలిప్పీన్స్​లో కల్మేగీ తుపాను దాటికి భారీ వరద పోటెత్తిందని, పలువురు ఇళ్లలోనే చిక్కుకోగా, డజన్లకొద్దీ కార్లు కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు.

భారత్‌నే లక్ష్యంగా చేసుకున్న ఓపెన్‌ఏఐ..నియామకాలు ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) విప్లవానికి మార్గదర్శకంగా నిలిచిన చాట్‌జీపీటీ మాతృసంస్థ OpenAI ఇప్పుడు భారత మార్కెట్‌పై దృష్టి సారించింది. ఈ ఏడాది ఆగస్టులో ఓపెన్‌ఏఐ అధికారికంగా భారత్‌లో బ్రాంచ్‌ ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం సొల్యూషన్‌ ఇంజనీర్‌ల నియామకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. బెంగళూరును కేంద్రంగా చేసుకుని, భారత డెవలపర్‌ కమ్యూనిటీలతో సంబంధాలను బలోపేతం చేయడం, టెక్నాలజీ భాగస్వామ్యాలను పెంచడం సంస్థ తదుపరి లక్ష్యమని చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ నారాయణన్‌ వివరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON