థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న 74వ మిస్ యూనివర్స్ 2025 పోటీలు అరుదైన నిరసన దృశ్యానికి వేదిక అయ్యాయి. ఆతిథ్య దేశానికి చెందిన ఒక ఉన్నతాధికారి.. మిస్ మెక్సికో ఫాతిమా బాష్‌ను బహిరంగంగా అవమానించడంతో దీనికి నిరసనగా పలు దేశాల నుంచి వచ్చిన పోటీదారులు వేదిక నుంచి సామూహికంగా వాకౌట్ చేశారు. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాత్ ఇత్సరక్రిసిల్, మిస్ మెక్సికో ఫాతిమా బాష్ మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

