విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ లు అమెరికాలో అరెస్టయ్యారు. గ్యాంగ్స్టర్ వెంకటేశ్ గార్గ్ను జార్జియాలోనూ.. కరుడగట్టిన లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు భాను రాణాను అమెరికాలోనూ హర్యానా పోలీసులు సహా భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు. గార్గ్, రాణాలను త్వరలోనే భారత్కు తీసుకురానున్నారు. ప్రస్తుతం భారత్కు చెందిన రెండు డజన్లకుపైగా గ్యాంగ్స్టర్లు విదేశాల్లో ఉంటూ రిక్రూట్మెంట్లు, క్రిమినల్ సిండికేట్లను నడుపుతూ తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు.

