loader

ఒకే కారులో ప్రయాణించిన మోడీ, పుతిన్.. వీడియో..!

 ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో దిగిన పుతిన్‌ను ఆలింగనం చేసుకొని వెల్‌కమ్ చెప్పారు మోడీ.  అనంతరం ఇరువురు రెడ్‌కార్పెట్‌పై నడుస్తూ అధికారులను   పరిచయం చేసుకుంటూ ముందుకు సాగారు. ఆ తర్వాత ఇరువురు నృత్యకారుల ప్రదర్శనను వీక్షించారు.    అక్కడే ఏర్పాటు   చేసిన అధికారిక టయోటా ఫార్చునర్ వాహనంలో  మోడీ, పుతిన్ విమానాశ్రయం నుంచి ప్రధాని అధికారిక నివాసానికి బయల్దేరి వెళ్లారు.

నాలుగేళ్ల తర్వాత భారత్​కు పుతిన్​- ఘన స్వాగతం పలికిన ప్రధాని మోదీ

భారత్‌ చిరకాల మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్  పుతిన్ నాలుగేళ్ల తర్వాత రెండురోజుల పర్యటనలో భాగంగా దిల్లీ చేరుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం సాయంత్రం 6గంటలా 40 నిమిషాలకు ఆయన విమానం దిల్లీలోని పాలం విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది. ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి పుతిన్‌కు స్వాగతం పలికారు. విమానాశ్రయంలోనే ఏర్పాటు చేసిన కళాకారుల సంప్రదాయ ప్రదర్శనలను పుతిన్‌ తిలకించారు. అనంతరం ప్రధాని మోదీ- రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఒకేకారులో వెళ్లారు.

ఆత్మాహుతి దాడిపై మహిళలకు జైషే మహమ్మద్‌ శిక్షణ- 5000 మంది చేరిక!

దిల్లీ పేలుడు కుట్రలో కీలక భాగస్వామి అయిన డా. షాహిన్‌ షాహిద్ జైషే మహమ్మద్‌ మహిళా విభాగం ‘జమాత్‌ ఉల్‌ మొమినాత్‌’ సభ్యురాలని దర్యాప్తు వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే ఇప్పటివరకు ఈ విభాగంలో 5000 మందికి పైగా చేరినట్లు తాజా సమాచారం. అక్టోబరు 8 నుంచి జైషే ప్రధాన కార్యాలయంలో ఈ బ్రిగేడ్‌ కోసం నియామకాలు ప్రారంభించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే జైషేలో పురుష ఉగ్రవాదుల తరహాలోనే వీరికి కూడా కఠిన శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

టెక్‌ కంపెనీల లే ఆఫ్స్‌ కారణం ఏఐ కాదు..ఐబీఎం సీఈవో అరవింద్‌ కృష్ణ..!

ఇటీవల కాలంలో టెక్‌ రంగంలో లేఆఫ్‌లో విపరీతంగా పెరిగిపోయాయి. పలు కంపెనీ పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఈ క్రమంలో తొలగింపులపై ఐబీఎం సీఈవో అరవింద్‌ కృష్ణ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న లే ఆఫ్స్‌కు ప్రధాన కారణం ఆర్టిఫిషియల్‌  ఇంటెలిజెన్స్‌ కాదని.. కొవిడ్‌ సమయంలో వేగంగా నియామకాలు జరగడమేనన్నారు. కరోనా సమయంలో చాలా కంపెనీలు సిబ్బందిని 30 నుంచి 100శాతం వరకు పెంచుకున్నాయని.. దాని ప్రభావం ఇప్పుడిప్పుడు కనిపిస్తుందన్నారు.

భారత సరిహద్దుల్లో ‘స్పై రోబో’ కలకలం..చైనా భయంకరమైన ప్లాన్..!

భారత్-చైనా సరిహద్దులో ఒక స్పై రోబోట్ కలకలం రేపింది. ఎల్‌ఏసీ సమీపంలో చైనాకు చెందిన ఓ రోబోట్‌ను భారత భద్రతా బలగాలు గుర్తించాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. భారత సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో ఇలాంటి రోబోట్లను  చైనా నిఘా కోసం ఉంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ముందున్న చైనా.. ఇప్పుడు సైనిక శక్తిలో కూడా రోబోట్లను విరివిగా వాడుతోంది. అత్యాధునిక డ్రోన్లు, ఆటోనమస్ వెహికల్స్ ఉపయోగిస్తోంది.

ర‌ష్యా డ్రోన్ త‌యారీ కేంద్రంపై 226 కేజీల బాంబు వ‌దిలిన ఉక్రెయిన్‌..

ర‌ష్యాలోని డ్రోన్ త‌యారీ కేంద్రంపై ఉక్రెయిన్ బాంబు దాడి చేసింది. వోవ్‌చాన్స్క్ లో ఉన్న డ్రోన్ కంట్రోల్ అండ్ క‌మ్యూనికేష‌న్ హ‌బ్‌ను పేల్చివేసింది. ఉక్రెయిన్ వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌-27 ఫైట‌ర్ జెట్‌.. సుమారు 226 కిలోల బాంబును జార‌విడిచింది. ఆ దాడికి చెందిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. డ్రోన్ సెంట‌ర్‌లో ఉన్న ఓ బిల్డింగ్‌పై సుఖోయ్ యుద్ధ విమానం బాంబును వేసింది. టార్గెట్‌ను చేరుకోగానే.. చాలా శ‌క్తివంత‌మైన పేలుడు జ‌రిగింది. దీంతో ద‌ట్ట‌మైన పొగ వ్యాపించింది.

హంతకుడి సమాచారమిస్తే 50 వేల డాలర్లు ఇస్తామంటున్న FBI

2017లో అమెరికాలోని న్యూజెర్సీలో శశికళ, 7 ఏళ్ల కుమారుడు అనీష్ దారుణ హత్య కేసులో అమెరికా దర్యాప్తు సంస్థ FBI ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న నజీర్ హమీద్ ఆచూకీ తెలిపిన వారికి 50,000 డాలర్ల (భారత కరెన్సీ రూ. 41 లక్షలు) రివార్డు అందిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం హమీద్ భారత్‌లోనే ఉన్నాడని భావిస్తున్న అమెరికా అధికారులు అతడిని తిరిగి అమెరికాకు రప్పించేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా హమీద్ అరెస్టుకు సంబంధించిన వారెంట్‌ను ఎఫ్‌బీఐ […]

పౌర అణు ఇంధన విభాగంలో భారత్‌తో ఎంఓయూ- రష్యా క్యాబినెట్ గ్రీన్స్ సిగ్నల్

రష్యా క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పౌర అణు ఇంధన విభాగంలో భారత్‌తో ద్వైపాక్షిక సహకారం బలోపేతానికి ఉద్దేశించిన అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకునే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. డిసెంబరు 4, 5 తేదీల్లో భారత్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటించనున్న తరుణంలో రష్యా క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తమిళనాడులో కుడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు చెందిన రియాక్టర్లను నిర్మిస్తున్న రష్యా సంస్థ రొసాతోమ్ న్యూక్లియర్ కార్పొరేషన్‌, రష్యా ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో […]

ఇమ్రాన్‌ సురక్షితంగానే ఉన్నారు.. కానీ: సోదరి ఉజ్మా

మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్‌ కలిశారు. ఇమ్రాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల నేపథ్యంలో ఆయనను కలిసేందుకు జైలు అధికారులు మంగళవారం అనుమతించారు. దీంతో పాకిస్తాన్ లోని అడియాలా జైలులో ఇమ్రాన్ ను ఆయన సోదరి ఉజ్మా కలిశారు. జైలులో ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగానే ఉన్నట్లు తెలిపారు. కానీ ఆయనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ మరణించారంటూ వార్తలు.. రావల్పిండి, ఇస్లామాబాద్‌లో భద్రత కట్టుదిట్టం

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ ఖాన్‌ హత్యకు గురైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇమ్రాన్‌ ఖాన్‌ను చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇమ్రాన్‌ పార్టీ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇమ్రాన్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ ఇస్లామాబాద్‌, రావల్పిండిలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనున్నారు. రెండు నగరాల్లో సెక్షన్ 144 విధించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON