loader

ఇకపై ఉద్యోగులకు కంప్యూటర్ పరీక్ష తప్పనిసరి

తెలంగాణ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై కొన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు కంప్యూటర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. ఈ నిర్ణయం జూనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ కమ్ టైపిస్టులు, సీనియర్ స్టెనోగ్రాఫర్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్లు, U.D. టైపిస్టులు, L.D. టైపిస్టులు, టైపిస్టులు వంటి వర్గాల వారికి వర్తిస్తుంది. ఉద్యోగులు కంప్యూటర్ పరీక్షలో మాత్రమే కాకుండా, ఆఫీసు ఆటోమెషినలో ప్రావీణ్యం కూడా కలిగి ఉండాలి. దీని కోసం డిపార్ట్మెంటల్ పరీక్ష నిర్వహించి, ఉత్తీర్ణులు కావాలని […]

తెలంగాణ రాజ్‌భవన్.. ఇకపై ‘లోక్‌భవన్’

తెలంగాణ రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాజ్‌భవన్‌లను లోక్‌భవన్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. వలస వాద వాసనలను తుడిచిపెట్టే ఉద్దేశంలో భాగంగా, రాజ్‌భవన్, రాజ్ నివాస్‌ల పేర్లను లోక్‌భవన్, లోక్‌నివాస్‌లుగా మార్చే అంశం అనుగుణంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అసోం, కేరళ, త్రిపుర, ఒడిశా రాజ్‌భవన్‌లను లోక్‌భవన్‌లుగా మార్చారు. తాజాగా ఆ జాబితాలో తెలంగాణ […]

బీజేపీకి దగ్గరవుతున్న హేమంత్.. ?

ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధినేత,ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వాన్ని కలవడం చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, సంకీర్ణ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు, సీబీఐ మరియు ఈడీ కేసుల వంటి అంశాల నేపథ్యంలో జేఎంఎం మరియు బీజేపీ మళ్లీ జట్టు కట్టే అవకాశం ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ రెండు […]

ఇమ్రాన్‌ సురక్షితంగానే ఉన్నారు.. కానీ: సోదరి ఉజ్మా

మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్‌ కలిశారు. ఇమ్రాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల నేపథ్యంలో ఆయనను కలిసేందుకు జైలు అధికారులు మంగళవారం అనుమతించారు. దీంతో పాకిస్తాన్ లోని అడియాలా జైలులో ఇమ్రాన్ ను ఆయన సోదరి ఉజ్మా కలిశారు. జైలులో ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగానే ఉన్నట్లు తెలిపారు. కానీ ఆయనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు.

SIRపై చర్చకు సిద్దమైన కేంద్రం

ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేసిన తీవ్ర అభ్యంతరాలు మరియు నిరసనల కారణంగా కేంద్ర ప్రభుత్వం మెట్టు దిగినట్లు సమాచారం. కేంద్రం డిసెంబర్ 10వ తేదీన ఎన్నికల సంస్కరణలపై విస్తృత స్థాయి చర్చకు సిద్ధమని ప్రకటించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం చర్చను ప్రారంభించే ముందు, గత నెల నవంబర్ 7వ తేదీన జరిగిన వందేమాతరం 150వ వార్షికోత్సవంపై ముందుగా చర్చించాలని ప్రతిపాదించినట్లు సమాచారం.

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ మొబైల్స్‌ను బ్యాన్‌ చేసిన ఆర్మీ.. ఇకపై ఐఫోన్స్‌నే

సైబర్‌ సెక్యూరిటీని బలోపేతం చేసేందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) కీలక నిర్ణయం తీసుకున్నది. లెఫ్టినెంట్ కల్నల్ అంతకంటే ఎక్కువ స్థాయి సీనియర్‌ అధికారులు ఇకపై అధికారిక కమ్యూనికేషన్స్‌ కోసం కేవలం ఐఫోన్స్‌ను మాత్రమే ఉపయోగించాలని ఆదేశించారు. భద్రతా కారణాల నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్స్‌ను పూర్తిగా నిషేధించారు. అనేక ఉల్లంఘనలు, సైన్యంలో సైబర్‌ గూఢచౌర్యం కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ డివైజెస్‌లో సైబర్ దాడులు పెరుగుతున్నట్లుగా ఇజ్రాయెల్‌ ఆర్మీ రేడియో, జెరూసలేం పోస్ట్‌ […]

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం

తెలంగాణలో జిల్లా అధ్యక్షులుగా నియమితులైన కాంగ్రెస్ నేతలు.. పదవి వచ్చిందని పెత్తనం చేయకుండా పని చేయాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కొత్త డీసీసీ అధ్యక్షుల పనితీరును ఆరు నెలల ప కాలంలో పరిశీలించి, సంతృప్తికరంగా లేకపోతే తీసేస్తామన్నారు. కొత్త నాయకత్వాన్ని నియమిస్తామన్నారు. ఈ నిర్ణయాన్ని ఎఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సమర్థించారు. పార్టీలో ‘పెర్ఫార్మెన్స్ బేస్డ్’ వ్యవస్థను ప్రవేశపెట్టే వ్యూహంలోనే దీన్ని అమలు చేస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఫెర్రో అల్లాయ్స్‌కు మరో ఏడాది ప్రోత్సాహకాలు పొడిగింపు..

ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ప్రభుత్వంపై రూ.1,053 కోట్ల భారం పడనుంది. విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, పీఎం కుసుమ్, ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద సోలార్ రూఫ్ టాప్ పథకం, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యయం తగ్గింపు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు

జైల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసేందుకు సోదరికి అనుమతి..

మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన సోదరికి ఎట్టకేలకు అనుమతి లభించింది. జైలులో ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆయనను చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు బలూచిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పుకార్లు రావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున పాక్ లోని రావిల్పిండి జైలు వద్ద ఆందోళనకు దిగారు.

రెండు దశల్లో ‘జన గణన’- డిజిటల్ విధానంలో నిర్వహిస్తాం: కేంద్రం

దేశంలో జనగణన రెండు దశల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2026 ఏప్రిల్​ – సెప్టెంబర్​ మధ్య మొదటి దశ, రెండో దశ “జన గణన 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1 మధ్యలో జరుగుతుంది. అయితే లద్ధాఖ్​, జమ్మూకశ్మీర్​, హిమాచల్ ప్రదేశ్​, ఉత్తరాఖండ్ ​ రాష్ట్రాల్లోని మంచుతో కప్పపడే నాన్​-సింక్రోనస్ ప్రాంతాల్లో జన గణన 2026 సెప్టెంబర్​ నుంచి అక్టోబర్​ 1 మధ్య జరుగుతుంది” అని మొబైల్ యాప్​ల ద్వారా డేటాను సేకరిస్తామని,నిత్యానంద్ రాయ్ లోక్​సభకు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON