తెలంగాణలో జిల్లా అధ్యక్షులుగా నియమితులైన కాంగ్రెస్ నేతలు.. పదవి వచ్చిందని పెత్తనం చేయకుండా పని చేయాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కొత్త డీసీసీ అధ్యక్షుల పనితీరును ఆరు నెలల ప కాలంలో పరిశీలించి, సంతృప్తికరంగా లేకపోతే తీసేస్తామన్నారు. కొత్త నాయకత్వాన్ని నియమిస్తామన్నారు. ఈ నిర్ణయాన్ని ఎఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సమర్థించారు. పార్టీలో ‘పెర్ఫార్మెన్స్ బేస్డ్’ వ్యవస్థను ప్రవేశపెట్టే వ్యూహంలోనే దీన్ని అమలు చేస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

