రూ.1కే కిలో అరటిపళ్లు.. అనంత రైతు కన్నీళ్లు
అనంతపురం జిల్లాలోని అరటి రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. బహిరంగ మార్కెట్‌లో డజను అరటిపళ్లు రూ.40 రూ.60 వరకు అమ్ముడవుతున్నప్పటికీ, రైతులకు కిలోకు రూ.1 మాత్రమే లభిస్తోంది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు పెట్టుబడి రాక కన్నీరు పెడుతున్నారు. టన్ను అరటికి కేవలం రూ.1,000 నుంచి 2,000 మాత్రమే ధర పలకడంతో రవాణా ఖర్చు కూడా గిట్టుబాటు కాక రైతులు పొలాల్లోనే పంటను మహారాష్ట్ర నుంచి అధిక దిగుమతి మరియు దళారుల దోపిడీ కారణంగా ఈ పరిస్థితి నెలకొంది.

