దేశంలో ఎక్కడా కూడా పింఛన్లకు రూ.6 వేలు ఇచ్చే ప్రభుత్వం లేదని.. ఒక్క ఏపీలో మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రూ.3 వేల పింఛన్‌ను రూ.6వేలకు పెంచామని గుర్తుచేశారు. దివ్యాంగులపై తమ ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ ఇదని పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులు కాబట్టే… అనేక రంగాల్లో రాణిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ(బుధవారం) తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు, పలువురు దివ్యాంగులను సన్మానించారు.

