జీవీఎంసీ పరిధిలో తీవ్ర అవ్యవస్థలు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలో రహదారులు, పార్కులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఏడాదిన్నరగా తమకు బిల్లులు చెల్లించకపోవడంతో రూ.400 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని వాపోతున్నారు. జీవీఎంసీలో పనులు పూర్తిగా ఆపేయాలని టూల్డౌన్కు సిద్ధమవుతున్నారు. జీవీఎంసీలో కొందరు కార్పొరేటర్లు పర్సంటేజీల పేరుతో దండుకుంటున్నారని, శంకుస్థాపన రాయి పడేలోపే కమీషన్ డబ్బులు ఖాతాల్లో జమ చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

