2017లో అమెరికాలోని న్యూజెర్సీలో శశికళ, 7 ఏళ్ల కుమారుడు అనీష్ దారుణ హత్య కేసులో అమెరికా దర్యాప్తు సంస్థ FBI ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న నజీర్ హమీద్ ఆచూకీ తెలిపిన వారికి 50,000 డాలర్ల (భారత కరెన్సీ రూ. 41 లక్షలు) రివార్డు అందిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం హమీద్ భారత్‌లోనే ఉన్నాడని భావిస్తున్న అమెరికా అధికారులు అతడిని తిరిగి అమెరికాకు రప్పించేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా హమీద్ అరెస్టుకు సంబంధించిన వారెంట్‌ను ఎఫ్‌బీఐ జారీ చేసింది.

