ఇటీవల కాలంలో టెక్ రంగంలో లేఆఫ్‌లో విపరీతంగా పెరిగిపోయాయి. పలు కంపెనీ పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఈ క్రమంలో తొలగింపులపై ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం
కొనసాగుతున్న లే ఆఫ్స్‌కు ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని.. కొవిడ్ సమయంలో వేగంగా నియామకాలు జరగడమేనన్నారు. కరోనా సమయంలో చాలా కంపెనీలు సిబ్బందిని 30 నుంచి 100శాతం వరకు పెంచుకున్నాయని.. దాని ప్రభావం ఇప్పుడిప్పుడు కనిపిస్తుందన్నారు.

