loader

మ‌హిళా జ‌ర్న‌లిస్టుకు క‌న్నుకొట్టిన పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జ‌ర్న‌ల్‌

పాకిస్థాన్ ఇంట‌ర్ స‌ర్వీసెస్ ప‌బ్లిక్ రిలేష‌న్స్‌(ఐఎస్పీఆర్) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌, లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ అహ్మ‌ద్ ష‌రీఫ్ చౌద‌రీ ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టుకు క‌న్నుసైగ చేయ‌డం వివాదాస్ప‌దం అయ్యింది. తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ గురించి మ‌హిళా జ‌ర్న‌లిస్టు అబ్సా కోమ‌న్ ప్ర‌శ్న వేసిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇమ్రాన్ ఖాన్ ఓ మెంట‌ల్ పేషెంట్ అని చెబుతూ మ‌హిళా జ‌ర్న‌లిస్టు వైపు క‌న్నుకొట్టాడు. పాకిస్థాన్‌లో ప్ర‌జాస్వామ్యం లేద‌ని, పీఎం ఓ కీలుబొమ్మ అయ్యార‌ని […]

ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

ఇండోనేషియాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. రాజధాని జకర్తాలోని ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. అనేక మంది గాయపడ్డారు.జపనీస్ డ్రోన్ సంస్థ టెర్రా డ్రోన్ కార్పొరేషన్‌ బిల్డింగ్‌లో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత మొదటి అంతస్తులో మంటలు చెలరేగగా.. కాసేపటికే అవి భవనం మొత్తం వ్యాపించాయి.ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 20 మంది మరణించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

సౌదీ సంచలన నిర్ణయం.. ముస్లింలు కాని విదేశీయులకు మాత్రమే మద్యం విక్రయాలు

సౌదీ అరేబియా తన సామాజిక సంస్కరణల్లో భాగంగా మద్యం విక్రయాలకు సంబంధించిన నిబంధనలను మరింత సడలించింది. నెలకు 50,000 రియాల్స్ (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.12 లక్షలు) లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ముస్లిమేతరులైన విదేశీ నివాసితులకు మద్యం కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సదుపాయాన్ని పొందడానికి విదేశీ నివాసితులు తమ ఆదాయాన్ని రుజువు చేస్తూ.. జీత ధృవీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది.

బియ్యం దిగుమ‌తుల‌పై భార‌త్‌కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్‌

భార‌తీయ బియ్యం దిగుమతుల‌పై అధిక టారిఫ్‌ను వ‌సూల్ చేసేందుకు అమెరికా సర్కారు సిద్ద‌మైంది. వ్య‌వ‌సాయ దిగుమ‌తుల‌పై కొత్త ప‌న్ను విధానాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు. భార‌త్ నుంచి దిగుమ‌తి అవుతున్న బియ్యంతో పాటు కెన‌డా నుంచి దిగుమ‌తి అవుతున్న ఫెర్టిలైజ‌ర్ల‌పై కొత్త సుంకాలు విధించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అమెరికా రైతుల కోసం ట్రంప్ స‌ర్కారు భారీ రిలీఫ్ ప్యాకేజీని ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో శ్వేత‌సౌధంలో జ‌రిగిన స‌మావేశంలో రైతు పెద్ద‌ల‌తో ట్రంప్ మాట్లాడారు.

మళ్లీ బద్దలైన కిలవేయ అగ్నిపర్వతం.. వెయ్యడుగుల ఎత్తుకు లావా

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలవేయ మరోసారి విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా ఉబికివస్తోంది. వెయ్యి అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతోంది. హవాయి జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న కాల్డెరాలోనే లావా నిలిచిపోయిందని స్పష్టంచేశారు. అయినప్పటికీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కిలవేయ అగ్నిపర్వతం 38 సార్లు విస్ఫోటనం చెందింది.

మైనర్‌పై అత్యాచారం కేసు.. న్యూజిలాండ్‌లో భారతీయుడికి ఏడేళ్ల జైలు

సత్వీందర్ సింగ్ అనే క్యాబ్‌ డ్రైవర్‌ గత 11 ఏళ్లుగా న్యూజిలాండ్‌లో ఉంటూ క్యాబ్‌ నడుపుతున్నాడు. 2023లో ఒక రోజు రాత్రి మైనర్‌ ప్రయాణికురాలు క్యాబ్‌ను బుక్‌ చేసుకుంది. ఈ క్రమంలో సత్వీందర్‌ సింగ్ జీపీఎస్‌ను ఆఫ్‌ చేసి.. కారును మార్గం మళ్లించాడు. అక్కడ మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. సీసీ కెమరాల ఆధారంగా సత్వీందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై తాజాగా అక్కడి న్యాయస్థానం విచారణ జరిపి.. ఏడేళ్లకుపైగా జైలుశిక్ష విధించింది.

కెనడాలో భారీ భూప్రకంపనలు.. 7.0 మాగ్నిట్యూడ్ నమోదు..

అలాస్కా, కెనడా సరిహద్దు ప్రాంతంలో భారీ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. యూఎస్ జియోలాకల్ సర్వే (USGS) తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో యూకోన్‌లో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని ది రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ధ్రువీకరించారు. 911కు భూప్రకంపనలకు సంబంధించి ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. ఉత్తర జెనీవా, అలాస్కాలకు 230 మైళ్ల దూరంలో.. వెస్ట్ వైట్ హార్స్, యూకోన్‌లకు 155 మైళ్ల దూరంలో […]

త్వరలో భారత్‌కు 40వేల ఇజ్రాయెల్‌ గన్స్‌- అర్బెల్‌ టెక్నాలజీ కూడా!

దేశ సైనిక సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. లైట్‌ మెషిన్‌ గన్స్‌తోపాటు కార్బైన్లను ఇజ్రాయెల్‌ సరఫరా చేయనుంది. ప్రపంచంలోనే తొలి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్‌ ‘అర్బెల్‌ టెక్నాలజీ’ని త్వరలోనే మన సైన్యానికి ఇజ్రాయెల్‌ తయారీ లైట్‌ మెషిన్‌ గన్స్‌ అందనున్నాయి. మొదటి విడతలో 40వేల లైట్‌ మెషిన్‌ గన్స్‌ అందనున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో వాటిని సరఫరా చేయనున్నట్లు రక్షణ పరికరాల సంస్థ ఇజ్రాయెల్‌ వెపన్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. ఇప్పటికే వాటి పరీక్షలు పూర్తయ్యాయని ఉత్పత్తి కోసం లైసెన్స్‌ పొందినట్లు వెల్లడించింది.

కాల్పులతో దద్దరిల్లిన దక్షిణాఫ్రికా.. 11 మంది మృతి, 14 మందికి గాయాలు

కాల్పులతో దక్షిణాఫ్రికా దద్దరిల్లింది. హాస్టల్‌పై దుండగులు కాల్పులు జరిపారు. 11 మంది మరణించగా, 14 మంది గాయపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రిటోరియాలోని సాల్స్‌విల్లేలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 4.15 గంటల సమయంలో సాయుధులైన ముగ్గురు వ్యక్తులు హాస్టల్‌లోకి చొరబడ్డారు. 25 మందిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు.

మిస్డ్ కాల్స్‌పై వాయిస్ లేదా వీడియో మెసేజ్‌ పంపించవచ్చు!

WhatsApp తన వినియోగదారుల కోసం చాలా ఉపయోగకరమైన ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇకపై మీ కాల్ అందుకోకపోతే, మీరు నేరుగా కాల్ స్క్రీన్ నుంచి వాయిస్ లేదా వీడియో సందేశాన్ని పంపవచ్చు. ఈ అప్‌డేట్ ప్రస్తుతం iPhone వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలో ఇతరులకు అందుబాటులోకి రానుంది. కాల్ రిసీవ్ చేసుకోనప్పుడు WhatsApp ఇప్పుడు ‘Record voice message’ ఎంపికను చూపుతుంది. మీరు అక్కడి నుంచే చిన్న ఆడియోను రికార్డ్ చేయవచ్చు, ఇది మిస్డ్ కాల్ నోటిఫికేషన్‌తో పాటు చాట్‌లో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON