పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పీఆర్) డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ ఓ మహిళా జర్నలిస్టుకు కన్నుసైగ చేయడం వివాదాస్పదం అయ్యింది. తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి మహిళా జర్నలిస్టు అబ్సా కోమన్ ప్రశ్న వేసిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఇమ్రాన్ ఖాన్ ఓ మెంటల్ పేషెంట్ అని చెబుతూ మహిళా జర్నలిస్టు వైపు కన్నుకొట్టాడు. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం లేదని, పీఎం ఓ కీలుబొమ్మ అయ్యారని కొందరు కామెంట్ చేశారు.

