దక్షిణ సుడాన్ రాజధాని జుబాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం కుప్పకూలిన ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సిటీలింక్ ఏవియేషన్ సంస్థకు చెందిన సెస్నా 208 కారవాన్ అనే విమానం జుబా నగర శివారులో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రతికూల వాతావరణం, పొగమంచు కారణంగా విమానం కుప్పకూలినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదం తర్వాత విమానం మంటల్లో దగ్దమైనట్లు చెబుతున్నారు. మృతి చెందిన ప్రయాణికుల్లో 12 మంది దక్షిణ సుడాన్,.. మిగిలిన ఇద్దరు కెన్యా జాతీయులని తెలుస్తోంది.

