అలాస్కా, కెనడా సరిహద్దు ప్రాంతంలో భారీ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. యూఎస్ జియోలాకల్ సర్వే (USGS) తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో యూకోన్‌లో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని ది రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ధ్రువీకరించారు. 911కు భూప్రకంపనలకు సంబంధించి ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. ఉత్తర జెనీవా, అలాస్కాలకు 230 మైళ్ల దూరంలో.. వెస్ట్ వైట్ హార్స్, యూకోన్‌లకు 155 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తేలింది.

