loader

అట్టుడుకుతున్న ఇరాన్‌.. నిరసనల్లో 2,000 మంది మృతి

సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు.ఇప్పటి వరకూ సుమారు 2 వేల మంది మరణించినట్లు ఇరాన్‌ అధికారులు వెల్లడించారు. ఈ మరణాలకు ఉగ్రవాదులే కారణమని వారు ఆరోపించారు. అయితే, భద్రతా దళాల కాల్పుల వల్లే పౌరులు మరణించినట్లు మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి.

లండన్‌లో ఘనంగా గోదారోళ్ల సంక్రాంతి వేడుకలు

లండన్‌లో ఘనంగా గోదారోళ్ల సంక్రాంతి వేడుకలు – 2026 ఘనంగా నిర్వహించారు. బ్రిటన్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచే గోదారోళ్ల సంక్రాంతి వేడుకలు కేరింతల మధ్య సరదాగా సాగాయి. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తెలుగు కుటుంబాలు హాజరయ్యారు. సంక్రాంతి పండుగ ప్రత్యేకతను చాటేలా భోగి మంటలు, ముగ్గులపోటీలు, హరిదాసుల కీర్తనలు, గొబ్బెమ్మల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు సంప్రదాయ చీరల్లో, పురుషులు పంచెకట్టుతో హాజరయ్యారు.

గ్రామాలను ఆక్రమిస్తుంటే ఇక్కడ ఆలింగనం చేసుకుంటున్నారు’- బీజేపీపై కాంగ్రెస్​ ఫైర్​

చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందంతో సమావేశమైన బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాఠే. అక్కడ అరుణాచల్ ప్రదేశ్​లో చైనా గ్రామాలను ఆక్రమిస్తుంటే, ఇక్కడ నేతలు ఆలింగనం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో చైనా కమ్యూనిస్టు నేతలతో సమావేశమైన ఫొటోను ఎక్స్​లో పోస్ట్ చేశారు. వారితో సమావేశమైనా బీజేపీని ప్రశ్నించడంలో మీడియా విఫలమైందని దుయ్యబట్టారు.

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం

బంగ్లాదేశ్‌లో హిందువులపై దారుణాలు ఆగడం లేదు. బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు,  స్థానికలు తెలిపిన సమాచారం ప్రకారం.. సమీర్ దాస్ అనే ఆటో డ్రైవర్‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు కొట్టి చంపారు. సమీర్ దాస్‌ను హత్య చేసిన తర్వాత, నిందితులు అతడి ఆటోను తీసుకుని పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు దక్షిణ కరీమ్‌పూర్ సమీపంలోని ముహురి బాడి దగ్గర తీవ్ర రక్తపు గాయాలతో ఉన్న మృతదేహాన్ని చూశారు.

డబ్బులిస్తావా.. బుల్లెట్‌ దించాలా?.. కెనడాలో భారతీయులకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌

భారత్‌-కెనడా పౌరులకు సేవలందచేస్తున్న భారతీయ ఇమిగ్రేషన్‌ కన్సల్టెంట్లు, కెనడాకు వలసవచ్చిన భారతీయ వృత్తి నిపుణులకు డబ్బుల కోసం బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ పెరిగిపోతున్నాయి. ఇటువంటి ఘటనలు గ్రేటర్‌ టొరంటో ఏరియా(జీటీఏ), వాంకోవర్‌ ప్రాంతంలో వెలుగుచూశాయి.బ్రాంప్టన్‌లో నివసించే భారతీయ ఇమిగ్రేషన్‌ కన్సల్టెంట్‌ విక్రమ్‌ శర్మ ఇంటిపై మాస్కు ధరించిన ఓ షూటర్‌ పలుమార్లు కాల్పులు జరిపాడు.కాల్పుల అనంతరం 5 లక్షల డాలర్లు చెల్లించాలని డిమాండు చేస్తూ తాను అడిగిన డబ్బులు చెల్లించకపోతే తర్వాతి తూటా నీ శరీరంలోనే దిగుతుందని […]

ట్రాన్సిట్ వీసా అవసరం లేదు.. భారతీయులకు జర్మనీ శుభవార్త..

భారతీయులకు జర్మనీ తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. జర్మనీ మీదుగా ప్రయాణించే భారతీయులు గతంలో ట్రాన్సిట్ వీసాను తీసుకోవాల్సి వచ్చేది. ఈ నిబంధన నుంచి భారతీయులకు తాజాగా జర్మనీ మినహాయింపు ఇచ్చింది. దీంతో, భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. దరఖాస్తులు చేసుకోవడం, వీసా కోసం వేచి చూడటం వంటి ఇక్కట్ల నుంచి విముక్తి లభించింది. భారతీయులకు వీసా ఫ్రీ ట్రాన్సిట్ సదుపాయాన్ని కల్పించినందుకు జర్మనీ ఛాన్సలర్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.

రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు

రష్యా లో కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. దాంతో రష్యాలో ఉద్యోగాలు చేయడానికి భారత్‌ నుంచి కొంతమంది అక్కడ వాలిపోయారు.వీరంతా రష్యాలో వీధులు శుభ్రం చేసే ఉద్యోగంలో చేరారు. 26 ఏళ్ల ముఖేష్ మండల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇండియాలో అతనికి ఉద్యోగం లేదు. అందుకే సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని వీధులు శుభ్రం చేసే ఉద్యోగంలో చేరారు. కార్మికుడికి నెలకు సుమారు 1,00,000 రూబుళ్లు సుమారుగా రూ. 1.1 లక్షల వేతనం.

అమెరికా- ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరిక

ఇరాన్‌లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో మరణించిన వారి సంఖ్య 500 దాటింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న నిరసనల సమయంలో అమెరికా దాడులకు పాల్పడితే కనుక తాము అమెరికా సైనికుల్ని, ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌లో అశాంతిని ప్రేరేపించారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఆరోపించారు. అమెరికా, ఇజ్రాయెల్ అల్లరి మూకలు, ఉగ్రవాదులను ఇరాన్‌ను అస్థిరపరచాలని ఆదేశిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్లో 538కి చేరిన మృతుల సంఖ్య- నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు

సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్, “ఇరాన్‌లో జరుగుతున్న పరిణామాలను ఇజ్రాయెల్ గమనిస్తోంది. స్వేచ్ఛ కోసం సాగుతున్న ఉద్యమం దేశమంతటా వ్యాపించింది. ఇరాన్ పౌరుల అపూర్వ ధైర్యాన్ని ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో చూస్తోంది” అని పేర్కొన్నారు. ఇరాన్ ప్రజల స్వేచ్ఛా పోరాటానికి ఇజ్రాయెల్ మద్దతుగా నిలుస్తుందని నెతన్యాహూ తెలిపారు. “పర్షియన్ జాతి త్వరలోనే అణచివేత పాలన నుంచి విముక్తి పొందాలని మేం ఆశిస్తున్నాం” అని అన్నారు

అల్లరి మూకలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయన్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్​

ఇరాన్​ అంతటా నిరసనలు విస్తరిస్తున్న నేపథ్యంలో​ అధ్యక్షుడు పెజెష్కియాన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనకారుల వాదనలు వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే కొంతమంది అల్లరి మూకలు మొత్తం సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అదే విధంగా ఇరాన్​లో జరుగుతున్న నిరసనల్లో ఇప్పటివరకు దాదాపు 203మంది చనిపోయినట్లు వార్త కథనాలు వెలువడ్డాయి. మృతుల్లో 162 మంది నిరసనకారులు ఉండగా, 41 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON