సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్, “ఇరాన్లో జరుగుతున్న పరిణామాలను ఇజ్రాయెల్ గమనిస్తోంది. స్వేచ్ఛ కోసం సాగుతున్న ఉద్యమం దేశమంతటా వ్యాపించింది. ఇరాన్ పౌరుల అపూర్వ ధైర్యాన్ని ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో చూస్తోంది” అని పేర్కొన్నారు.
ఇరాన్ ప్రజల స్వేచ్ఛా పోరాటానికి ఇజ్రాయెల్ మద్దతుగా నిలుస్తుందని నెతన్యాహూ తెలిపారు. “పర్షియన్ జాతి త్వరలోనే అణచివేత పాలన నుంచి విముక్తి పొందాలని మేం ఆశిస్తున్నాం” అని అన్నారు

