భారత్-కెనడా పౌరులకు సేవలందచేస్తున్న భారతీయ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్లు, కెనడాకు వలసవచ్చిన భారతీయ వృత్తి నిపుణులకు డబ్బుల కోసం బెదిరింపు ఫోన్ కాల్స్ పెరిగిపోతున్నాయి. ఇటువంటి ఘటనలు గ్రేటర్ టొరంటో ఏరియా(జీటీఏ), వాంకోవర్ ప్రాంతంలో వెలుగుచూశాయి.బ్రాంప్టన్లో నివసించే భారతీయ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ విక్రమ్ శర్మ ఇంటిపై మాస్కు ధరించిన ఓ షూటర్ పలుమార్లు కాల్పులు జరిపాడు.కాల్పుల అనంతరం 5 లక్షల డాలర్లు చెల్లించాలని డిమాండు చేస్తూ తాను అడిగిన డబ్బులు చెల్లించకపోతే తర్వాతి తూటా నీ శరీరంలోనే దిగుతుందని కాలర్ తనను బెదిరించినట్లు శర్మ చెప్పారు.

