బంగ్లాదేశ్‌లో హిందువులపై దారుణాలు ఆగడం లేదు. బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికలు తెలిపిన సమాచారం ప్రకారం.. సమీర్ దాస్ అనే ఆటో డ్రైవర్‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు కొట్టి చంపారు. సమీర్ దాస్‌ను హత్య చేసిన తర్వాత, నిందితులు అతడి ఆటోను తీసుకుని పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు దక్షిణ కరీమ్పూర్ సమీపంలోని ముహురి బాడి దగ్గర తీవ్ర రక్తపు గాయాలతో ఉన్న మృతదేహాన్ని చూశారు.

