loader

ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్

అమెరికాతో చర్చలకు సిద్ధమంటూ ఇరాన్ దిగి వచ్చింది. అలాంటి వేళ ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశానికి చెందిన మిలటరీ నాయకత్వంతోపాటు రక్షణ రంగానికి చెందిన సామర్థ్యాలను నాశనం చేశామన్నారు. ఇదంతా జరిగిన తర్వాత తమతో చర్చలకు సిద్ధమని ఇరాన్ అంటోందని పేర్కొన్నారు. కానీ ఇప్పటికే ఆలస్యమైందనంటూ ట్రంప్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు

దక్షిణ లెబనాన్ ప్రాంతాలపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు నిర్వహించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. పలుచోట్ల భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం. లెబనాన్‌ లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ దాడులు ప్రాంతీయ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.

యూఏఈ, బహ్రెయిన్‌లోని మా మూడు డేటా సెంటర్లపై దాడి : అమెజాన్‌

పశ్చిమాసియా దేశాల్లోని అమెజాన్‌ డేటా సెంటర్‌లపై కూడా ఇరాన్ దాడులు జరిగాయి. ఈ విషయాన్ని అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఇవాళ ధ్రువీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని తమ రెండు డేటా సెంటర్లపై డ్రోన్‌లు దాడి చేశాయని అమెజాన్‌ పేర్కొన్నది. బహ్రెయిన్‌లోని డేటా సెంటర్‌ సమీపంలో జరిగిన దాడివల్ల మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో ఉద్యోగులు ఎవరైనా గాయపడ్డారా..? లేదా..? అనే విషయం గురించి సంస్థ స్పష్టం చేయలేదు.

ఇరాన్‌లో 4.3 తీవ్ర‌త‌తో భూకంపం.. అణు కేంద్రాల‌పై భ‌యాందోళ‌న‌లు

ఇరాన్‌లో ఇవాళ భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై 4.3 తీవ్ర‌త‌గా న‌మోదు అయ్యింది. ద‌క్షిణ ఇరాన్‌లోని ఫార్స్ ప్రావిన్సులో ఉన్న ఖోంజ్ వ‌ద్ద భూకంప కేంద్రం ఉన్న‌ది. భూమికి సుమారు 10 కిలోమీట‌ర్ల లోతులో ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయిన‌ట్లు అమెరికా జియోలాజిక‌ల్ స‌ర్వే పేర్కొన్న‌ది. స్థానిక కాల‌మానం 10.24 నిమిషాల‌కు భూకంపం వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. గీర‌శ్ అనే ప‌ట్ట‌ణానికి 55 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్న‌ది. 4.3 తీవ్ర‌త భూకంపాన్ని స్వ‌ల్ప స్థాయి నుంచి మ‌ధ్య‌స్థాయి […]

హిజ్బుల్లా నిరాయుధీకరణ: లెబనాన్ నిర్ణయానికి EU మద్దతు

లెబనాన్ ప్రభుత్వం తన దేశంలో హిజ్బుల్లా సైనిక కార్యకలాపాలను ముగించాలని తీసుకున్న నిర్ణయాన్ని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా స్వాగతించారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ఇది ఒక కీలక అడుగు అని ఆయన అభివర్ణించారు. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్‌తో చర్చలు జరిపిన అనంతరం, కోస్టా సోషల్ మీడియా వేదికగా పలు కీలక అంశాలను వెల్లడించారు.

భారత్ కెనడా మధ్య యురేనియం ఒప్పందం

భారత్‌కెనడా మధ్య సోమవారం 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం కుదిరింది.ఈమేరకు రెండు దేశాలు సంతకాలు చేశాయి. అలాగే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అంగీకారం కుదిరింది. హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్రమోడీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో పౌర అణు ఇంధన కార్యక్రమానికి నిరంతర సరఫరాను నిర్ధారించడమే ఈ డీల్ ఉద్దేశం.

ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన ఖమేనీ భార్య మన్సూరే మృతి

అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ గత శనివారంనాడు తొలిసారి టెహ్రాన్‌పై జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే సోమవారంనాడు మరణించినట్టు ఆదేశ అధికారిక వార్తా సంస్థ తెలిపింది. ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటికే ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనుమరాలు మృతి చెందారు. ఖమేనీ మృతితో ఇప్పటికే ఉద్రిక్తతలు చోటుచేసుకోగా, మన్సూర్ ఖోజాస్తే కూడా మరణించడంతో టెహ్రాన్ నాయకత్వంపై ఒత్తిడి పెరిగి ఉద్రితకలు […]

సౌదీ, బహ్రెయిన్ నేతలకు మోదీ ఫోన్.. భారతీయుల భద్రతపై ఆరా

ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణలు, డ్రోన్ దాడులపై విరుచుకుపడుతుండటం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు ఫోను చేశారు. ఇరువురు నేతలతో సంభాషణల్లో సౌదీ అరేబియా, బహ్రెయిన్‌పై ఇరాన్ జరుపుతున్న దాడులను మోదీ ఖండించారు. రెండు దేశాల్లోని భారతీయుల […]

సౌదీ ఆరాంకోపై ఇరాన్ డ్రోన్ ఎటాక్​- చమురు శుద్ధి కర్మాగారం మూసివేత

సోమవారం సౌదీ ఆరాంకోకు చెందిన కీలక ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి చేసింది. దీనితో ఆరాంకో తన ‘రాస్​ తనూరా రిఫైనరీ’ని మూసివేసినట్లు ప్రకటించింది. సౌదీ అరేబియాలోని గల్ఫ్​ తీరంలో ఉన్న రాస్​ తనూరా కాంప్లెక్స్​ రోజుకు 5,50,000 బ్యారెల్స్​ సామర్థ్యంతో పశ్చిమాసియాలోనే అతిపెద్ద రిఫైనరీల్లో ఒకటిగా ఉంది. ఇప్పటికే ఇరాన్​ అబుదాబి, దుబాయ్​, దోహా, మనామా సహా ఒమన్​లోని నౌకాశ్రయం దుక్మ్​పై కూడా దాడి చేసింది. UAE, ఒమన్​లోని ప్రధాన షిప్పింగ్ హబ్​లు పూర్తిగా నిలిచిపోయాయి.

అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీపై ఇరాన్‌ డ్రోన్ల దాడి

ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా మిత్రదేశాలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులకు దిగుతోంది. గల్ఫ్ దేశాల్లోని కీలక ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతూ యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ఆర్థికంగా దెబ్బతీసే వ్యూహంతో సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని ఇరాన్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. డ్రోన్ల దాడితో రిఫైనరీ వద్ద భారీ ఎత్తున మంటలు చెలరేగినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ దాడుల ప్రభావంతో గల్ఫ్ ప్రాంతంలో విమాన రాకపోకలు స్తంభించడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON