loader

దాడి చేయకుంటే ఇరాన్ అణుశక్తివంతం అయ్యేది: నెతన్యాహు

ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించిందని, కొన్ని నెలల్లోనే శక్తివంతం అయ్యేదని అందుకనే ఇజ్రాయెల్, అమెరికా కలిసి అత్యవసరంగా దాడి చేయక తప్పలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మంగళవారం “ ఫాక్స్ న్యూస్‌” ఇంటర్వూలో వెల్లడించారు. దాడుల నుంచి రక్షించుకునేందుకు ఇరాన్ కొత్తగా బాలిస్టిక్ క్షిపణుల తయారీ కోసం భూగర్భంలో అణు కార్యక్రమాల క్షేత్రాలను, బంకర్లను, నిర్మించడం ప్రారంభించిందని ,ఇప్పుడు దాన్ని నివారించకుంటే భవిష్యత్తులో ఏ చర్య తీసుకోలేమని నెతన్యాహు పేర్కొన్నారు.

ఢిల్లీ విమానాశ్రయంలో 80 అంతర్జాతీయ సర్వీసులు రద్దు

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం అవుతుండడంతో అంతర్జాతీయ విమానసర్వీసుల ఆపరేషన్‌కు అవాంతరాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో 80 అంతర్జాతీయ విమానసర్వీసులు రద్దయ్యాయి. 36 సర్వీసులు బయల్దేరవలసినవి కాగా, 44 సర్వీసులు రావలసినవని అధికారులు వెల్లడించారు. ఎమిరేట్స్ ఫ్లైట్ ఇకె 513 దుబాయ్‌కు వెళ్లవలసి ఉన్నప్పటికీ ఎయిర్‌స్పేస్ అవాంతరాల వల్ల తిరిగి న్యూఢిల్లీకి చేరుకుంది. మంగళవారం దుబాయ్ నుంచి డిల్లీకి 149 మంది ప్రయాణికులను ఎయిర్ ఇండియా సర్వీస్ తీసుకొచ్చింది.

గ్యాస్ సిలిండర్లు పేలి కూలర్ల గోదాంలో చెలరేగిన మంటలు

గ్యాస్ సిలిండర్లు పేలి కూలర్ల గోదాంలో మంటలు చెలరేగిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు పట్టణంలోని బాలాజీ నగర్ లో చోటుచేసుకుంది. గోదాం నుండి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పాటు దట్టమైన పొగ కమ్మేసింది. లోపల ఉన్న కూలర్లు, విడిభాగాలు ప్లాస్టిక్ మరియు గడ్డితో తయారైనవి కావడంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న సుమారు వందలాది కూలర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

మెక్సికోలో షకీరా రికార్డు, 4 లక్షల జనసందోహం!

మెక్సికో సిటీలోని ఐకానిక్ Zócalo స్క్వేర్‌లో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌తో షకీరా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఉచిత ఈవెంట్‌కు సుమారు 4 లక్షల మందికి పైగా అభిమానులు హాజరైనట్లు స్థానిక గణాంకాలు చెబుతున్నాయి. జోకాల చరిత్రలో ఇంత భారీ జనసందోహం ఇదే తొలిసారి అని నివేదికలు వెల్లడించాయి. నగరం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించగా, రద్దీని నియంత్రించేందుకు సమీప ప్రాంతాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

ఒమన్ ఓడరేవు పై ఇరాన్ డ్రోన్ దాడి

ఖమేని హత్యకు ప్రతీకారంగా ఇరాన్ సాగిస్తున్న ప్రతీకార దాడులలో భాగంగా మంగళవారం ఉదయం ఒమన్ లోని రాస్ అల్ -జైమా ఓడరేవుపై ఇరానియన్ డ్రోన్ దాడి చేసింది. దాడులలో మంటలు ఎగసి పడ్డాయి. డ్రోన్ మంటల్లో దూసుకుపోతూ, కెమెరాకు చిక్కింది. ఓడరేవు అంతటా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఇరాన్, అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే గల్ఫ్ లోని దేశాలలో అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులు, ఓడరేవులు, ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి.

గ్రహణం తర్వాత తెరుచుకున్న శ్రీవారి ఆలయ తలుపులు

చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన తిరుమల వెంకటేశ్వర ఆలయం తలుపులను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా తిరిగి తెరిచారు. మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 6:47 గంటల వరకు గ్రహణం కొనసాగడంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 9 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. రాత్రి 7:30 గంటలకు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, కైంకర్యాలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి 8 గంటల నుండి శ్రీ‌వారి దర్శనం ప్రారంభమైంది.

వేట్లపాలెంలో బాణసంచా పేలుడుపై విచారణ కమిటీ ఏర్పాటు

వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి 24 మంది మరణించారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మున్సిపల్‌ పరిపాలన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌కుమార్‌, ఈగల్‌ ఐజీ రవికృష్ణ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రమాద ఘటనకు బాధ్యులను గుర్తించాలని జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. నెల రోజుల్లో నివేదిక అందజేయాలని కమిటీని ఆదేశించింది.

కలెక్టర్లకు సీఎం గ్రేడింగ్: కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

జిల్లాల్లో పనితీరు మెరుగ్గా చూపించిన కలెక్టర్లకు ప్రత్యేక గ్రేడింగ్ ఇవ్వాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ల పనితీరును విశ్లేషించినట్లు తెలుస్తోంది. అమలులో ముందున్న జిల్లాలకు ప్రశంసలు, మెరుగుదల అవసరమైన ప్రాంతాలకు సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయిన కలెక్టర్లకు ప్రత్యేక మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

గ్రామసభల్లో 99 డేస్ ప్రోగ్రాం గురించి వివరించండి.. కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిజమైన అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. 99 రోజుల కార్యాచరణలో అందరి భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.

జగన్‌ను కలిసిన భట్టి, వివాహ ఆహ్వానం అందజేత

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు YS జగన్ మోహన్ రెడ్డిను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.రాజకీయ భేదాలకు అతీతంగా ఈ సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని వర్గాలు తెలిపాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON