loader

ఛాంపియన్స్ పై ప్రముఖల ప్రశంసలు..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టీమ్ ఇండియా గెలుపును చరిత్రలో నిలిచిపోయేలా చేసిందని అన్నారు.భారత క్రికెట్ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. అంటూ పోస్ట్ చేశారు. టీమ్ ఇండియా గెలుపుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ..అద్భుతమైన ఆట, అద్భుతమైన ఫలితం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తెచ్చినందుకు మన క్రికెట్ జట్టు పట్ల గర్వంగా ఉంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టీమ్ ఇండియా గెలుపుపై ట్వీట్ చేశారు.అదరగొట్టారు అబ్బాయిలూ! మీరంతా ఒక బిలియన్ గుండెల్ని గర్వపడేలా […]

ఛాంపియన్స్ ట్రోఫీ: విజేతకు కళ్లు చెదిరే ప్రైజ్ మనీ!

ప్రపంచకప్ తర్వాత అతి పెద్ద టోర్నీగా, మినీ ప్రపంచ కప్ గా పరిగణించే ఈ ట్రోఫీ గెలిచిన విజేతకు ప్రైజ్ మనీ సైతం భారీగా ఉండబోతోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీని 53% పెంచింది. గెలిచిన జట్టుకు 2.24 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.20 కోట్లు) దక్కుతాయి. అంటే విజేతకు రూ.20 కోట్లు అన్నమాట. రెండో స్థానంలో నిలిచిన జట్టుకు 1.12 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 9.72 కోట్లు) వస్తాయి. సెమీఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియా, […]

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బిగ్‌ డే

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్‌, న్యూజిలాండ్ తలపడనున్నాయి. గ్రూప్ దశలో న్యూజిలాండ్‌పై అద్భుతమైన విజయంతో సహా టోర్నమెంట్‌లో అజేయ రికార్డుతో టీమ్ ఇండియా ఫైనల్ పోరుకు చేరింది. కివీస్ ఆటుపోట్లను తిప్పికొట్టి టైటిల్‌ను గెలుచుకోవాలని ఆసక్తిగా ఉంది. దుబాయ్ వేదికపై టీమిండియాతో ఆధిపత్యంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఇక్కడ 10 మ్యాచ్‌లు ఆడితే 9 సార్లు గెలిచింది.

‘పిచ్‌ అడ్వాంటేజ్‌’ విమర్శలకు కౌంటర్‌

చాంపియన్స్‌ ట్రోఫీలో తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఒకే వేదికపై ఆడుతున్న భారత జట్టుకు ‘పిచ్‌ అడ్వాంటేజ్‌’ లభిస్తుందని వస్తున్న విమర్శలకు టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చాడు. దుబాయ్‌ తమ సొంత గ్రౌండ్‌ కాదని, ఇక్కడి పిచ్‌లు తమకూ కొత్త సవాళ్లను విసురుతున్నాయని తెలిపాడు. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్లు నాసిర్‌ హుస్సేన్‌, అథర్టన్‌తో పాటు ఆసీస్‌ సారథి పాట్‌ కమిన్స్‌.. భారత్‌ అన్ని మ్యాచ్‌లను ఒకే వేదికపై ఆడటం వారికి భారీ ప్రయోజనాన్ని చేకూర్చుతుందని […]

డిజిటల్ స్ట్రీమింగ్ లో భారత్, పాక్ మ్యాచ్‌ రికార్డు- జియో హాట్‌స్టార్‌

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ డిజిటల్ స్ట్రీమింగ్ లో రికార్డు స్థాయిలో వీక్షించడంతో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ ను జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో 53 కోట్లకు పైగా లైవ్ వీక్షించారు. 33వ ఓవర్ లో 53.3 కోట్లు (533 మిలియన్లు) ఒకేసారి దాయాదుల పోరును ఇంట్లో కూర్చుని చూశారు. భారీ స్థాయిలో వ్యూస్ తో జియో హాట్ స్టార్ కొత్త రికార్డులు నెలకొల్పింది.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్‌ . . .భారత్ Vs పాకిస్తాన్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ దుబాయ్ వేదికగా హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. పాకిస్థాన్‌తో తలపడనుండగా ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ నేరుగా సెమీస్‌కు చేరనుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించింది పాకిస్థాన్‌. ఈ మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.

ఖో ఖో ప్రపంచ కప్ 2025: సెమీస్‌లో భారత మహిళల జట్టు

ఖోఖో ప్ర‌పంచ క‌ప్ 2025 లో భార‌త జ‌ట్టు దుమ్మురేపుతోంది. పురుషుల జ‌ట్టుతో పాటు మ‌హిళ‌ల జ‌ట్టు కూడా టాప్ గేర్ లో ముందుకు సాగుతోంది. అద్భుత‌మైన ఆట‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు షాకిస్తూ ఇప్ప‌టికు ఒక్క ఓట‌మి కూడా లేకుండా భార‌త మ‌హిళ ఖోఖో జ‌ట్టు తన జైత్రయాత్ర‌ను కొన‌సాగిస్తోంది. జనవరి 17,  న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భార‌త మ‌హిళ జ‌ట్టు సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. ఈ విజ‌యంతో […]

గుకేశ్ కు ఎలాన్ మ‌స్క్ అభినంద‌న‌లు . . .

భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ను ఎలాన్ మ‌స్క్ అభినంద‌న‌లు తెలిపారు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన విష‌యం తెలిసిందే. చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌ను ఓడించి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ గా అవ‌త‌రించాడు. 18 ఏళ్లకే ఇలా వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్‌గా నిలిచాడు. త‌ద్వారా ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన (18ఏళ్ల 8నెలల 14రోజులు) ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు . . .

ఐపీఎల్ రిటెన్షన్ జాబితాలు వచ్చేశాయి. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలను ఆయా ఫ్రాంచైజీలు నేడు ప్రకటించాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సాధ్యమైనంత వరకు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ జట్టు కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (18 కోట్లు), అభిషేక్‌ శర్మ (14 కోట్లు), నితీశ్‌కుమార్‌ రెడ్డి (6 కోట్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (23 కోట్లు), ట్రవిస్‌ హెడ్‌ (14 కోట్లు) మరోసారి రిటైన్‌ చేసుకుంది.

ఫోగట్‌కు నిరాశ.. ఫోగట్‌ అప్పీల్‌ను తిరస్కరించిన కాప్‌

పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు వ్యతిరేకంగా వినేష్ ఫోగట్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సిఎఎస్) బుధవారం కొట్టివేసింది. రజత పతకం కోసం వినేష్ ఫోగట్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించినట్లు రెవ్‌స్పోర్ట్జ్ బుధవారం నివేదించింది. 100 గ్రాముల అధిక బరువుతో ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. రజత పతకం కోసం కాస్‌ను ఆశ్రయించిన ఫోగట్‌కు ఇటు భారతీయ క్రీడా అభిమానులకు చివరకు నిరాశే మిగిలింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON