loader

అగ్రనేత ఎల్‌.కె.అద్వానీ ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్‌.కె.అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ.. అద్వానీకి పూలగుచ్ఛం అందజేసి ఆప్యాయంగా పలకరించారు. 98వ ఏట అడుగుపెట్టిన అద్వానీ ఈ ఏడాది భారత అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’తో సత్కరించబడిన విషయం తెలిసిందే.

బ్యాట్ పట్టుకోలేడు కానీ ఐసీసీ ఛైర్మనా ? జై షాపై రాహుల్ పంచ్ లు..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు, ఐసీసీ ఛైర్మన్ కూడా అయిన జై షాపై విమర్శలు గుప్పించారు. “మీరు అదానీ, అంబానీ లేదా అమిత్ షా కొడుకు అయితేనే మీరు పెద్దగా కలలు కనగలరు. అమిత్ షా కొడుకు (జై షా)కి బ్యాట్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, పరుగు తీయడం మర్చిపోండి. కానీ ఆయన క్రికెట్ చీఫ్. క్రికెట్‌లో ప్రతి దానినీ ఆయన నియంత్రిస్తాడు. ఆయన ప్రతిదీ ఎందుకు నియంత్రిస్తాడు? […]

కేసీఆర్ ముద్ర‌ను చెర‌ప‌డం నీ జేజ‌మ్మ‌తో కూడా కాదు..హ‌రీశ్‌రావు

జూబ్లీహిల్స్ ప్యాలెస్ కిటికీలో నుండి చూస్తే నీకు కనపడే తీగల వంతెన కట్టింది కేసీఆర్ కాదా.. రోజూ మీ ఇంటికి వెళ్లేటప్పుడు కనిపించే టీ హబ్ గాని, స్టీల్ బ్రిడ్జి గాని కేసీఆర్ గారు కట్టింది కాదా.. అని హ‌రీశ్‌రావు అడిగారు. హైద‌రాబాద్ న‌గ‌రంపై కేసీఆర్ ముద్ర‌ను చెర‌ప‌డం నీ జేజ‌మ్మ‌తో కూడా కాదు అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.

అమిత్‌షా రహస్య సమావేశాలు.. కాంగ్రెస్ సంచలన ఆరోపణ

బిహార్ ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా‌పై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేర సంచలన ఆరోపణలు చేశారు. ‘హోం మంత్రి ఎప్పుడు పాట్నా వచ్చినా హోటల్ ఎలివేటర్లలోని సీసీటీవీ (కెమెరాలు)పై పేపర్లు అంటిస్తున్నారు. అధికారులతో ఆయన రహస్య మంతనాలు సాగిస్తున్నారు. అంత రహస్యంగా మీరు జరుపుతున్న సమావేశాలు ఏమిటి?’ అని అమిత్‌షాను ఆయన ప్రశ్నించారు. తొలి దశ పోలింగ్‌లో తమకు సానుకూలంగా లేకపోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలను కుదించుకున్నట్టు తెలిసిందని […]

తిరుపతి పర్యటనలో పవన్ కళ్యాణ్‌కు నిరసన సెగ..

పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన సందర్భంగా తిరుపతి కలెక్టరేట్ ఎదుట పలువురు ఆందోళనకు దిగారు. వీరిలో శ్రీకాళహస్తి జనసేన బహిష్కృత నేత కోట వినుత డ్రైవర్ రాయుడు అలియాస్ శ్రీనివాస్ కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారూ.. మీరే న్యాయం చేయాలంటూ రాయుడు కుటుంబం తిరుపతి కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులు ప్రదర్శించింది. రాయుడు పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అని, చనిపోయి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ.. జనసేన నుంచి స్పందన లేదని.. పవన్ కళ్యాణ్ తమకు న్యాయం […]

మహారాష్ట్రలో భూ కుంభకోణాల కలవరం- ఫడణవీస్‌ సర్కార్ పై కాంగ్రెస్ ఫైర్

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తనయుడు పార్థ పవార్కు చెందిన సంస్థకు రూ.1800 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.300 కోట్లకే కేటాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. మరో భూ కుంభకోణం లో రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ రూ.200 కోట్ల విలువైన భూమిని రూ.3 కోట్లకే దక్కించుకున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది.దీనిపై అజిత్ పవార్ స్పందిస్తూ అది ప్రభుత్వానికి చెందిన భూమి అని తన కుమారుడికి తెలియదని చెప్పారు. ఆ భూ కేటాయింపులను రద్దు చేసినట్లు ప్రకటించారు.

నాపై తప్పుడు కేసులు పెట్టిన, ఏ ఒక్కరినీ వదిలిపెట్టను.. విడదల రజిని వార్నింగ్‌

తనపై దుష్ప్రచారం చేస్తూ.. తప్పుడు కేసులు పెడుతున్నారని ఏపీ మాజీ మంత్రి విడదల రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపై, నా కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టిన వాళ్లను వదిలిపెట్టనని హెచ్చరించారు. టీడీపీ నాయకుల మెప్పు కోసం తప్పుడు ఫిర్యాదు ఇస్తున్నారని మండిపడ్డారు. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. తన అనుచరులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే తొలగించాలంటూపల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు కు వినతి పత్రం అందజేశారు.

NTR పేరు వాడుకోవడం సిగ్గుచేటు!

తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఓట్ల కోసం ఇప్పుడు ఎన్టీఆర్ పేరును వాడుకోవడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని గుర్తుచేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చింది ఇందిరా గాంధీనే అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

బీహార్‌ ఎంపీ రెండు చేతుల వేళ్లకు ఎన్నికల సిరా..

బీహార్‌ ఎంపీ రెండు చేతుల వేళ్లకు ఎన్నికల సిరా గుర్తులున్నాయి. మీడియాకు ఆమె తన రెండు చేతి వేళ్లను చూపించింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఆ ఎంపీ రెండు ఓట్లు వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ గురువారం జరిగింది. ఎన్డీయే కూటమికి చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) సమస్తిపూర్‌ ఎంపీ శాంభవి చౌదరి తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు.

మాగంటి మరణం వివాదంలోకి నన్ను లాగొద్దు: సిఎం

మాగంటి గోపినాథ్ మరణాన్ని తాను రాజకీయం చేయదలచుకోలేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాగంటి గోపినాథ్ మరణం వివాదాల్లోకి తనను లాగొద్దని కోరారు. గోపినాథ్ మరణంపై ఆయన తల్లి కొన్ని ఆరోపణలు చేశారని.. గోపినాథ్ మరణంపై అనుమానాలు ఉంటే బండి సంజయ్ ఫిర్యాదు చేయాలని అన్నారు. బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే పోలీసులు దర్యాప్తు చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, బిఆర్ఎస్, బిజెపి చేసింది శూన్యమని ఆయన […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON