loader

రాష్ట్ర ప్రజలకు కనుమ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా అన్నదాతలకు కనుమ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి సంబరాల్లో మూడవ రోజైన కనుమను రైతులు తమకు చేదోడు వాదోడుగా ఉండే పశువుల పట్ల కృతజ్ఞత చూపే రోజని ఆయన గుర్తుచేశారు. ఈ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ప్రకృతికి మరియు మానవుడికి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కొనియాడారు.

ముంబై మున్సిపల్ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏంటంటే..

ముంబై మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్టిట్ పోల్స్ మాత్రం బీజేపీ-శివసేన (ఏక్‌నాథ్ షిండే) కూటమి గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి బీజేపీ-శివసేన కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని యాక్సిస్ మై ఇండియాతో పాటు  జేవీసీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, బీజేపీ-శివసేన కూటమికి 131-151, శివసేన(యూబీటీ)-ఎమ్ఎన్‌ఎస్‌ కూటమికి 58-68,కాంగ్రెస్‌కు 20, బీజేపీ-శివసేన 119 సీట్లల్లో గెలిచే అవకాశం ఉందని సకల్ పోల్ అంచనా వేసింది.

కుటుంబంతో క‌లిసి బీఆరెస్ అధినేత‌ కేసీఆర్ సంక్రాంతి సంబురాలు

బీఆరెస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబంతో క‌లిసి సంక్రాంతి సంబురాలు చేసుకున్నారు. ఎర్రవెల్లిలోని త‌న నివాసంలో ఈ సంబురాలు జ‌రుపుకున్నారు. కేసీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌మ్మ‌, కుమారుడు కేటీఆర్‌, కోడ‌లు శైలిమ‌, మ‌నువ‌డు, మ‌నువ‌రాలు సంతోషంగా సంబురాల్లో పాల్గొన్నారు.

పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు : స్పీకర్ క్లీన్​చీట్

ఇద్దరు ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య బీఆర్‌ఎస్‌లోనే ఉన్నట్టు స్పీకర్‌ వెల్లడించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారారనేందుకు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వేసిన పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ముందే తీర్పును వెల్లడించారు. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని.. స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. రిజర్వేషన్లు ఖరారు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయడంతో, స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా మున్సిపాలిటీల వారీగా చూస్తే, మొత్తం 121 స్థానాల్లో జనరల్ కేటగిరీ కింద 61 స్థానాలు (జనరల్ 30, జనరల్ మహిళ 31) కేటాయించారు. బీసీలకు 38 స్థానాలు (జనరల్ 19, మహిళ 19), ఎస్సీలకు 17 స్థానాలు (జనరల్ 9, మహిళ 8), మరియు ఎస్టీలకు […]

జోరుగా మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు.. ఓటేసిన పలువురు ప్రముఖులు..

మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2869 స్థానాలకు గురువారం ఉదయం 7.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 3.48 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్,మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. బీజేపీ నేత ప్రకాశ్ జావడేకర్ కుటుంబ […]

‘మహా’ పోల్స్ డే.. మరాఠీ కార్డుతో ఠాక్రేలు, అభివృద్ధి ఎజెండాతో ఫడ్నవిస్

మహారాష్ట్ర పురపోరు కు సర్వం సిద్ధమైంది. బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)   సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు గురువారంనాడు పోలింగ్ జరుగనుంది.   గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ కీలక ఎన్నికలను ప్రధాన   పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విస్తృత ప్రచారం సాగించాయి. మహాయుతి కూటమి   గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఈ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందని చెబుతుండగా,    ఐక్యంగా బరిలోకి దిగిన ఠాక్రే సోదరులు సైతం గెలుపుపై ధీమాతో ఉన్నారు.

NTV జర్నలిస్టుల అరెస్టును ఖండించిన వైఎస్ జగన్

NTV జర్నలిస్టుల అరెస్టులను వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇది పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడి. పండుగ రోజు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి.. బలవంతంగా జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి.. అరెస్టు చేయటం దారుణం. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా, కనీసం నోటీసులు జారీ చేయకుండా జర్నలిస్టులను అరెస్టు చేయటం సరికాదు.  రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాలనీ, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ప్రభుత్వాన్ని […]

సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో – హరీష్ రావు ఆగ్రహం

బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జర్నలిస్టుల అరెస్టులను సమర్థిస్తూ సజ్జనార్ మాట్లాడటాన్ని తప్పుబడుతూ, మీరు పోలీసు అధికారిలా కాకుండా కాంగ్రెస్ ప్రతినిధిలా మాట్లాడుతున్నారు. మీకు అంతగా ఇష్టముంటే ఖాకీ చొక్కా తీసేసి, కాంగ్రెస్ కండువా కప్పుకుని రాజకీయం చేయండి అంటూ ఘాటుగా విమర్శించారు. జర్నలిస్టుల అరెస్టులను వెనకేసుకురావడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన ధ్వజమెత్తారు. గతంలో మంత్రి కొండా సురేఖ, కేటీఆర్ పై , ఒక అగ్ర నటిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను హరీష్ […]

‘సీఎం మార్పు’ అంశం కర్ణాటకలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటకలోని మండకల్లి నుండి దిల్లీకి తిరిగి వెళ్లేందుకు మండకల్లి విమానాశ్రయానికి హెలికాప్టర్‌లో రాహుల్ చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయనతో డిప్యూటీ సీఎం డీకే కాసేపు సంభాషించారు. విమానాశ్రయంలో రాహుల్, డీకే మాట్లాడుకున్న ఫొటోలు కర్ణాటక అధికార పక్షంలో సంచలనం సృష్టించాయి. ఇంతకీ వారు ఏం చర్చించారు ? డీకే ఏం అడిగారు? రాహుల్ ఏం చెప్పారు? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON