మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2869 స్థానాలకు గురువారం ఉదయం 7.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 3.48 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్,మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. బీజేపీ నేత ప్రకాశ్ జావడేకర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓట్లు వేశారు

