తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయడంతో, స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా మున్సిపాలిటీల వారీగా చూస్తే, మొత్తం 121 స్థానాల్లో జనరల్ కేటగిరీ కింద 61 స్థానాలు (జనరల్ 30, జనరల్ మహిళ 31) కేటాయించారు. బీసీలకు 38 స్థానాలు (జనరల్ 19, మహిళ 19), ఎస్సీలకు 17 స్థానాలు (జనరల్ 9, మహిళ 8), మరియు ఎస్టీలకు 5 స్థానాలు (జనరల్ 3, మహిళ 2) దక్కాయి.

