ముంబై మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్టిట్ పోల్స్ మాత్రం బీజేపీ-శివసేన (ఏక్‌నాథ్ షిండే) కూటమి గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి బీజేపీ-శివసేన కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని యాక్సిస్ మై ఇండియాతో పాటు జేవీసీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, బీజేపీ-శివసేన కూటమికి 131-151, శివసేన(యూబీటీ)-ఎమ్ఎన్‌ఎస్ కూటమికి 58-68,కాంగ్రెస్‌కు 20, బీజేపీ-శివసేన 119 సీట్లల్లో గెలిచే అవకాశం ఉందని సకల్ పోల్ అంచనా వేసింది.

