ఇద్దరు ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య బీఆర్‌ఎస్‌లోనే ఉన్నట్టు స్పీకర్ వెల్లడించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారారనేందుకు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వేసిన పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ముందే తీర్పును వెల్లడించారు. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని.. స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

