loader

ద్రోహ బుద్ధి అనేది రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే ఉంది : హరీష్‌ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ముమ్మాటికీ రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర.. సమైక్యవాదుల కొమ్ముకాస్తూ, స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్. చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ‘ఓటుకు నోటు’ దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అని హరీష్‌ […]

హత్యా రాజకీయాలు చేస్తే వదిలేది లేదు: మంత్రి గొట్టిపాటి

పల్నాడు జిల్లాలో వైసీపీ హయాంలో రక్తాలు పారితే, టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయని పల్నాడు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత ఘటనలకు రాజకీయ రంగు పులిమి వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. అరాచకాలతో గందరగోళం సృష్టించేది వైసీపీ అయితే, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. హత్యా రాజకీయాలు ఎక్కడ జరిగినా తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదని తేల్చిచెప్పారు.

మీకు గొడవలుంటే తలుపులు మూసుకుని కొట్టుకోండి..సీఎం రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ ఖమ్మం బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఈ సందర్భంగారెండు టీవీ ఛానెల్‌లు స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులను వివాదంలోకి లాగవద్దని సూచించారు. ఆ రెండు ఛానెళ్ల యాజమాన్యాల మధ్య గొడవలు ఉంటే వాళ్లు తలుపులు మూసుకుని కొట్టుకోవాలని సీఎం వ్యాఖ్యానించారు. అంతేతప్ప రాజకీయ నాయకులను ఆ గొడవల్లోకి లాగొద్దని చెప్పారు. తన మంత్రుల మీద తప్పుడు ప్రచారాలు చేసినా, వారిని బదనాం చేసినా బాగుండదని హెచ్చరించారు. అదేవిధంగా ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా […]

మంత్రులపై వార్తలు రాసేముందు నా వివరణ తీసుకోండి : సీఎం రేవంత్‌రెడ్డి

సింగరేణిలో బొగ్గు స్కామ్‌ అని విలేకరులు వార్తలు రాస్తున్నారని, క్యాబినెట్ మంత్రులపై వార్తలు రాసేముందు ఒకసారి తన వివరణ కూడా తీసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. ప్రభుత్వంపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తూ, టెండర్ల గురించి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక్షంగా, పరోక్షంగా కుంభకోణం జరిగిందని కొన్ని వార్తా పత్రికలు రాయడం పట్ల ఆక్షేపించారు. సింగరేణి బొగ్గు మాయమైందని అంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజా ప్రభుత్వంలో అవకతవకలకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు.

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడటానికే పార్టీ పెట్టారు: చంద్రబాబు

దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ రాకముందు చదువులేని వ్యక్తులే ఎక్కువగా రాజకీయాల్లో ఉండేవారని,చదువుకున్న వారికే ఎన్టిఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. చదువుకున్న వారికే ఎన్టిఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడటానికే ఎన్టిఆర్ పార్టీ పెట్టారని తెలియజేశారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో ఎన్టిఆర్ వర్దంతి కార్యక్రమం జరిగింది. ఎన్టిఆర్ విగ్రహానికి సిఎం పార్టీ నేతలతో కలిసి నివాళులర్పించారు.

YSR మీద కోపంతోనే నన్ను ఇలా చేస్తున్నారు.. ఆ గద్దలను రానివ్వను: డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

సింగరేణి బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో తన పేరును బయటకు తీయటంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఒక ప్రముఖ మీడియా సంస్థ కథనంపై అత్యంత ఘాటుగా స్పందించారు. సింగరేణి బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో తన పేరును ప్రస్తావిస్తూ సదరు పత్రికా యజమాని రాసిన కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిని కావడంతో ఆయన మీద ఉన్న కోపంతోనే ఇప్పుడు తనపై ఇటువంటి […]

ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

నేడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌ను ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. తాత సమాధిపై పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లలో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజించడం ఎన్టీఆర్‌కు మాత్రమే దక్కిన […]

సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు ఉద్యమిస్తాం : మాజీ మంత్రి తలసాని

సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు ఉద్యమిస్తాం అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే చేసుకోమన్న పోలీసులు ముందు రోజు రాత్రి అనుమతి నిరాకరించారన్నారు. ర్యాలీకి రాకుండా అడుగడుగునా అడ్డుకున్నారని ఆరోపించారు. భయానక వాతావరణం సృష్టించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మన నిరసన తెలపడంలో విజయవంతం అయ్యామన్నారు. 220 సంవత్సరాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ మన అస్తిత్వం, ఆత్మగౌరవం. సికింద్రాబాద్ కార్పోరేషన్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం […]

జిల్లాల రద్దు కుట్రపై ఉద్యమ కార్యాచరణ చేపట్టాలి : బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపు

ప్రజలకు పరిపాలన ఫలాలు అందకుండా జిల్లాల పునర్విభజన పేరుతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం జిల్లాల రద్దుపై చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ( KTR ) పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. పాలమూరు, నల్గొండ జిల్లాలకు సంబంధించిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న ఆలస్యం, కృష్ణా జలాల వాటా వంటి కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు.

“‘నా ఇల్లు కూల్చిన వారికి తగిన శాస్తి జరిగింది’: BMC ఫలితాలపై కంగనా రనౌత్

ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ ఫలితాల అనంతరం కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. “మహారాష్ట్రలో బీజేపీ సాధించిన ఈ అద్భుతమైన విజయం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. “నాడు నన్ను దూషించి, నా ఇంటిని కూల్చివేసి, మహారాష్ట్ర విడిచి వెళ్లాలని బెదిరించిన వారిని.. ఈ రోజు మహారాష్ట్ర ప్రజలే రాష్ట్రం నుంచి వెలేశారు. మహిళలపై ద్వేషం చిమ్మే వారు, బంధుప్రీతి మాఫియాకు జనం సరైన చోటు చూపించినందుకు నాకు గర్వంగా ఉంది” అని ఆమె […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON