సింగరేణిలో బొగ్గు స్కామ్ అని విలేకరులు వార్తలు రాస్తున్నారని, క్యాబినెట్ మంత్రులపై వార్తలు రాసేముందు ఒకసారి తన వివరణ కూడా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వంపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తూ, టెండర్ల గురించి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక్షంగా, పరోక్షంగా కుంభకోణం జరిగిందని కొన్ని వార్తా పత్రికలు రాయడం పట్ల ఆక్షేపించారు. సింగరేణి బొగ్గు మాయమైందని అంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజా ప్రభుత్వంలో అవకతవకలకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు.

