సింగరేణి బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో తన పేరును బయటకు తీయటంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఒక ప్రముఖ మీడియా సంస్థ కథనంపై అత్యంత ఘాటుగా స్పందించారు. సింగరేణి బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో తన పేరును ప్రస్తావిస్తూ సదరు పత్రికా యజమాని రాసిన కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిని కావడంతో ఆయన మీద ఉన్న కోపంతోనే ఇప్పుడు తనపై ఇటువంటి అసత్య కథనాలు రాస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

