loader

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నితిన్ న‌బిన్

భార‌తీయ జ‌న‌తా పార్టీ కొత్త జాతీయ అధ్య‌క్షుడిగా నితిన్ న‌బిన్ ఎన్నియ్యారు. ఇవాళ అధికారికంగా ఆయ‌న పేరును బీజేపీ ప్ర‌క‌టించింది. ఢిల్లీలోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో.. రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ కే ల‌క్ష్మ‌ణ్ చేతుల మీదుగా జాతీయ అధ్య‌క్షుడిగా ఎన్నికైన స‌ర్టిఫికేట్‌ను నితిన్ అందుకున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, బీజేపీ మాజీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌, అమిత్ షా, నితిన్ గ‌డ్క‌రీ ఈ కార్యక్ర‌మంలో పాల్గొన్నారు. కొత్త అధ్య‌క్షుడిగా నితిన్ […]

ఎన్ని కేసులు పెట్టినా.. తగ్గేదే లే: హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది బాగోతం పొద్దున బయటపెడితే సాయంత్రం నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి హరీశ్‌‌రావు విమర్శించారు. సిద్దిపేటలో ఉంటే రాత్రి మా ఇంటి వద్ద సిబ్బందికి నోటీసులు ఇచ్చి వెళ్లారని తెలిపారు. చట్టాన్ని గౌరవించి నేను రాత్రి సిద్దిపేట నుంచి వచ్చి, ఇవాళ సిట్ విచారణకు వెళ్తున్నానని పేర్కొన్నారు. సిట్ విచారణకు బయల్దేరి వెళ్లేముందు హైదరాబాద్‌లోని కోకాపేట నివాసం వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బయపడనని స్పష్టం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు టాప్ గేర్‌లోకి వెళ్లింది. ఈ కేసులో ఇప్పటికే BRS మాజీ MLAలు జైపాల్‌యాదవ్, చిరుమర్తి లింగయ్యను విచారించారు సిట్ అధికారులు. ఇప్పుడు లేటెస్ట్‌గా బీఆర్ఎస్‌ ముఖ్యనేత, మాజీమంత్రి హరీష్‌రావుకు నోటీసులు ఇవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్పీని ఇటీవలే సుప్రీం కోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు సుప్రీం […]

ఖమ్మం లోక్‌సభ నుంచి నేనే పోటీ చేస్తా: రేణుకా చౌదరి

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి నేనే పోటీ చేస్తా&, నా గెలుపును బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అడ్డుకోగలరా ?” అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు,  రేణుకా చౌదరి ప్రశ్నించారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘విబి జి రామ్ జి’గా మార్పు చేయడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు. మహిళలు ఎటువంటి దుస్తులు ధరించాలన్నది చెప్పేందుకు ఎవరికీ అధికారం లేదన్నారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై పిచ్చిగా ఎవరు […]

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎంపికయ్యారు. మంగళవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అత్యంత పిన్న వయస్కుడైన నితిన్.. పార్టీ పగ్గాలు చేపట్టడం గమన్హారం. . ఈ మేరకు ఢిల్లీలో నితిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ నేతలు పరిశీలిస్తున్నారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ ఎంపిక చేయడంతో పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు ప్రధాని మోదీ మంత్రివర్గంలోనూ భారీ మార్పులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అప్పుడే గొప్ప దేశాలు నిర్మాణమవుతాయి : రాహుల్ గాంధీ

 ప్రజలు వారి అభిప్రాయాలు, భావాలను వ్యక్తపరిచి వాటి కోసం పోరాడినప్పుడే  గొప్ప దేశాలు నిర్మితమవుతాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కేరళ కాంగ్రెస్​ ప్రకటించిన ప్రియదర్శిని సాహిత్య అవార్డును ప్రముఖ రచయిత్రి డాక్టర్ ఎమ్​ లీలావతికి ప్రదానం చేశారు రాహుల్.  ప్రస్తుత మౌన సంస్కృతిలో నాకు దక్కాల్సింది లభిస్తున్నంత కాలం ఏమి జరిగినా పర్వాలేదనే దురాశ భావన ఇమిడి ఉంది.  ప్రజలు అవమానాలు, హత్యలకు గురవడాన్ని చూస్తున్నాను. ” అని రాహుల్ గాంధీ అన్నారు.

ఏపీ డీజీపీ ఆఫీస్ ముందు వైఎస్సార్సీపీ నేతల ధర్నా

డీజీపీ వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ హత్యపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ ఆఫీసుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు.. ఆయన అపాయింట్మెంట్ను కోరారు. అపాయింట్మెంట్ ఇచ్చేందుకు డీజీపీ గుప్తా నిరాకరించారు. డీజీపీ కార్యాలయం స్పందించకపోవడంతో గేటు ముందు వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో నిరసనకు తలొగ్గి ఏడీజీ ఫిర్యాదు తీసుకున్నారు. డీజీపీ కార్యాలయంలో కనీసం మనుషులుగా కూడా గౌరవించలేదని..వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు.

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేయడంతో.. సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. అయితే మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌పై సమాధానం చెప్పాలని స్పీకర్‌కు నోటీసులు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్పీకర్‌ అమలు చేయలేదని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్ వేశారు.

దళితుడని మా నాన్నను టిడిపి నాయకుడు చంపేశాడు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైసిపి కార్యకర్త మందా సాల్మన్ పై తెలుగుదేశం కార్యకర్తలు ఇనుపరాడ్డుతో దాడి చేయడంతో మృతి చెందాడు. తాము దళితులమే, సామాన్యులమే అంతా మాత్రాన తన తండ్రి ప్రాణాలకు విలువ లేదా? అని ప్రశ్నించారు. తండ్రిని కోల్పోయి తామంతా బాధలో ఉంటే స్థానిక టిడిపి నాయకుడు అవహేళన చేసి మాట్లాడడం చాలా బాధాకరంగా ఉందని మృతుడి కుమారులు ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా తన తండ్రిని చంపిన వారిని […]

ముఖ్యమంత్రివా లేక ముఠా నాయకుడివా?: కెటిఆర్ ఫైర్

ముఖ్యమంత్రివా లేక ముఠా నాయకుడివా..? అంటూ సిఎం రేవంత్‌రెడ్డిని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, అసాంఘిక చర్యలను, నేరాలను ప్రోత్సహించేలా మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండాపై ఉన్న చెక్కుచెదరని అభిమానాన్ని చూసి ముఖ్యమంత్రికి మైండ్ బ్లాక్ అయ్యిందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON