సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది బాగోతం పొద్దున బయటపెడితే సాయంత్రం నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేటలో ఉంటే రాత్రి మా ఇంటి వద్ద సిబ్బందికి నోటీసులు ఇచ్చి వెళ్లారని తెలిపారు. చట్టాన్ని గౌరవించి నేను రాత్రి సిద్దిపేట నుంచి వచ్చి, ఇవాళ సిట్ విచారణకు వెళ్తున్నానని పేర్కొన్నారు. సిట్ విచారణకు బయల్దేరి వెళ్లేముందు హైదరాబాద్‌లోని కోకాపేట నివాసం వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బయపడనని స్పష్టం చేశారు.

