భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నియ్యారు. ఇవాళ అధికారికంగా ఆయన పేరును బీజేపీ ప్రకటించింది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో.. రిటర్నింగ్ ఆఫీసర్ కే లక్ష్మణ్ చేతుల మీదుగా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సర్టిఫికేట్ను నితిన్ అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త అధ్యక్షుడిగా నితిన్ బాధ్యతలు స్వీకరించారు.

