ప్రజలు వారి అభిప్రాయాలు, భావాలను వ్యక్తపరిచి వాటి కోసం పోరాడినప్పుడే గొప్ప దేశాలు నిర్మితమవుతాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కేరళ కాంగ్రెస్ ప్రకటించిన ప్రియదర్శిని సాహిత్య అవార్డును ప్రముఖ రచయిత్రి డాక్టర్ ఎమ్ లీలావతికి ప్రదానం చేశారు రాహుల్. ప్రస్తుత మౌన సంస్కృతిలో నాకు దక్కాల్సింది లభిస్తున్నంత కాలం ఏమి జరిగినా పర్వాలేదనే దురాశ భావన ఇమిడి ఉంది. ప్రజలు అవమానాలు, హత్యలకు గురవడాన్ని చూస్తున్నాను. ” అని రాహుల్ గాంధీ అన్నారు.

