loader

దేశానికి మేలు చేసే కార్యక్రమాలకు అండగా నిలవాలి: చంద్రబాబు

వారానికి ఒకసారి మండలానికి, గ్రామానికి స్వచ్ఛ రథం వస్తుందని సిఎం చంద్రబాబు తెలిపారు. పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారని అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రజలకు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వాలన్నదే తమ ఉద్దేశం అని.. అందుకే ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో పాల్గొంటానని అన్నారు. దేశానికి, రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారో ప్రజలు గమనించాలని,  దేశానికి ఎంతో మేలు చేసే కార్యక్రమాలకు అండగా నిలవాలని కోరారు.

గుంతకల్లులో టీడీపీ నేత దౌర్జన్యం.. సోలార్ ఉద్యోగిపై దాడి

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. గుత్తి మండలం బేతాపల్లిలో టీడీపీ నేత రవితేజ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ, ఆ ఇసుకను కొనుగోలు చేయాలని స్థానిక సోలార్ కంపెనీ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారు. ఒక్కో టిప్పర్ ఇసుకను ఏకంగా రూ. 24,000కు కొనుగోలు చేయాలని హుకుం జారీ చేశారు. అయితే, ఇంత భారీ మొత్తానికి ఇసుకను కొనేందుకు సదరు సోలార్ ఉద్యోగి నిరాకరించడంతో, ఆగ్రహం చెందిన రవితేజ, అతని అనుచరులు విచక్షణారహితంగా దాడికి […]

జోడోలో రాహుల్‌తో ఉన్న వ్యక్తి పనే ఇది.. పాత ఫోటో విడుదల చేసిన బీజేపీ

ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు శుక్రవారంనాడు వీరంగం చేయడం, చొక్కాలు విప్పి నిరసన తెలపడం ఆ పార్టీని వివాదంలోకి నెట్టింది. అయితే ఈ చర్యను కేంద్ర మంత్రులతో సహా బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో భారత్‌జోడో యాత్రలో రాహుల్‌తో కనిపించిన వ్యక్తే ఏఐ ఇంపాక్ట్ సదస్సులో వీరంగం చేసినట్టు బీజేపీ నేత అమిత్‌ మాలవీయ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక ఫోటోను […]

సీఎం స్టాలిన్‌తో మాజీ సీఎం ఓపీఎస్‌ భేటీ..!

అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, AIADMK వాలంటీర్ల హక్కుల పునరుద్ధరణ కమిటీ సమన్వయకర్త O. పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి M.K. స్టాలిన్‌ను స్వయంగా కలుసుకుని మాట్లాడారు. అసెంబ్లీలో స్టాలిన్ పాలన బాగుంది అంటూ పన్నీ్ర్ సెల్వం ప్రశంసలు కురింపించారు స్టాలిన్-ఓపీఎస్ సమావేశం తర్వాత, ఓపీఎస్ డీఎంకే పార్టీలో చేరబోతున్నారా అనే ప్రశ్న తలెత్తింది.

తొందరేమీ లేదు.. అన్నింటికీ సమయం వస్తుంది: అంబటి

తొందరేమీ లేదు.. అన్నింటికి మూల్యం చెల్లించుకునే సమయం వస్తుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పర్మిషన్‌ తీసుకునే నల్లపాడు వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లాను. టీడీపీ నేతలు కర్రలు, రాడ్డులు తీసుకుని నా కారు మీదకు వచ్చారు. 1వ తేదీ రాత్రి 10 గంటల 20 నిమిషాలకు నన్ను అరెస్ట్‌ చేశారు. టీడీపీ నేతలు కట్టిన ఫ్లైక్సీని చించలేదు. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పా. 4 గంటల పాటు బీభత్సం సృష్టిస్తే పోలీసులు […]

పరువు నష్టం కేసు విచారణకు హాజరైన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లక్నోలోని సుల్తాన్‌పూర్ కోర్టులో పరువు నష్టం కేసు విచారణలో భాగంగా హాజరయ్యారు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు దాఖలైంది. బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతుండగా, నేటి విచారణలో భాగంగా రాహుల్ గాంధీ కోర్టుకు హాజరై తన హాజరును […]

భార్యాపిల్లలను వివాదాల్లోకి లాగుతారా?’.. సీఎంపై ప్రియాంక ఆగ్రహం

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్‌కు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు సహజమని, అయితే ఒక నాయకుడి భార్యను, పిల్లలను ఇటువంటి వివాదాల్లోకి లాగడం అత్యంత దుర్మార్గమైన రాజకీయమని ఆమె మండిపడ్డారు. గౌరవ్ గొగోయ్ ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటూ కుటుంబ సభ్యులను వేధించడం సరికాదని

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత.. నిమ్స్‌కు తరలింపు

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, జీవన్‌ రెడ్డి ఇటీవల కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సీనియర్‌ అయిన తనను సరిగా గౌరవం ఇవ్వడం లేదని అసృంతృప్తికి లోనవుతున్నాడు. జీవన్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జగన్‌ ఒక హ్యాబిట్యుయల్ క్రిమినల్ – ఏపీ హోంమంత్రి తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ను ఒక హ్యాబిట్యుయల్ క్రిమినల్ గా అభివర్ణించారు. ప్రజలను నేరుగా ఎదుర్కోలేక, భయంతో దాక్కునే వ్యక్తి అని ఎద్దేవా చేశారు. జగన్ ప్రవర్తనను చూస్తుంటే ఆయనకు ఏదో రోగం ఉన్నట్లు అనిపిస్తోందని, ఆ రకమైన మనస్తత్వానికి ఏ పేరు పెట్టాలో గూగుల్‌లో వెతికినా దొరకడం లేదని అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను చేసే తప్పులను ఇతరులపైకి నెట్టడం […]

రాష్ట్రం అప్పుల్లోకి వెళ్తుంటే… మీరేమో గాల్లో వెళ్తున్నారు..

బడ్జెట్‌లో చూపించిన లెక్కలు, రాష్ట్ర ఆర్థిక వాస్తవాల మధ్య పెద్ద తేడా ఉందని ఆరోపించారు. ఈ బడ్జెట్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా రూపొందించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు సరైన విధంగా ఉపయోగించడం లేదని, అవి ప్రజల అభివృద్ధికి దోహదం కావడం లేదని కూడా ఆరోపించారు. మరోవైపు ప్రభుత్వ నాయకుల ఖర్చులు పెరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,నారా లోకేష్,పవన్ కళ్యాణ్ విమానాలు,హెలికాప్టర్లల్లో తరచూ ప్రయాణాలు చేస్తూ ప్రభుత్వ ఖర్చులు పెంచుతున్నారని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON