ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు శుక్రవారంనాడు వీరంగం చేయడం, చొక్కాలు విప్పి నిరసన తెలపడం ఆ పార్టీని వివాదంలోకి నెట్టింది. అయితే ఈ చర్యను కేంద్ర మంత్రులతో సహా బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో భారత్‌జోడో యాత్రలో రాహుల్‌తో కనిపించిన వ్యక్తే ఏఐ ఇంపాక్ట్ సదస్సులో వీరంగం చేసినట్టు బీజేపీ నేత అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక ఫోటోను తాజాగా షేర్ చేశారు.

