loader

కాపుల సాయంతో అధికారంలోకి వచ్చి వేధిస్తారా?: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం

‘మాజీమంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి బాధాకరం. ఇళ్లమీద దాడి చేయడం సరికాదు’అని ముద్రగడ పద్మనాభం హితవు పలికారు. ‘మేము (కాపు) బానిసలం కాదు.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మేము రాలేదు. కాపుల సహకారంతో  రెండు సార్లు అధికారం చేపట్టి, రెండుసార్లు కాపులను అవమానించారు. మొదటి సారి నన్ను, నా కుటుంబాన్ని హింసించి పచ్చి భూతులు తిట్టారు. ఇప్పుడు అంబటి రాంబాబుని హింసించారు’అని ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రధానిపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు

తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ‘‘మాకు నరేంద్ర మోదీ అంటే భయం లేదు. మోదీ తండ్రి వచ్చినా సరే మేము భయపడబోము” అని వ్యాఖ్యానించారు. టీవీలో మోదీ కనిపిస్తే ప్రజలు భయపడుతున్నారని, అదే సీఎం స్టాలిన్ కనిపిస్తే కొత్త పథకాలు వస్తాయని సంతోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ‘తమిళనాడు వర్సెస్ ఢిల్లీ’ మధ్య జరుగుతున్న పోరాటమని ఉదయనిధి అభివర్ణించారు.

వరద కాలువలో శవమై తేలిన బీజేపీ నేత రమణ

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్ధపల్లిలో గత మూడు రోజులుగా అదృశ్యమైన బీజేపీ నేత రమణ, ఆదివారం స్థానిక వరద ఎస్సారెస్పీ కాలువలో శవమై కనిపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా రమణ పని చేశారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. ప్రమాదవశాత్తు కారు కాలువలో పడిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నియోజకవర్గాల పునర్విభజనకు సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక సంకేతాలు వచ్చాయి. నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంపై కేంద్రం ఇటీవల సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ పునర్విభజన ప్రక్రియకు సంబంధించి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మార్పులు అమలైతే ఆంధ్రప్రదేశ్‌లో 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి  అసెంబ్లీ స్థానాలు సుమారు 50 వరకు పెరగడంతో పాటు, లోక్‌సభ సీట్లు కూడా మరో 7 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా […]

గిరిజన సర్పంచ్‌పై అగ్ర కులస్తుల దాడి.. ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు..!

మండల పరిధిలోని రేగుల గడ్డ సర్పంచ్‌ ధనావత్ గుణ నాయక్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. నిరూపయోగంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని మరొక చోట పాతాలని చెప్పినందుకు ఆయనపై దాడికి దిగారు. ‘మా ఇంటి దగ్గర స్తంభాన్ని తరలించాలని చెబుతావా?’ అని చామల ఉపేందర్ రెడ్డి, చామల పెద్ద రామిరెడ్డిలు సర్పంచ్‌పై దాడి చేశారు. వారి దాడిలో సర్పంచ్ గుణ నాయక్‌కు గాయాలయ్యాయి. అవసరమున్న చోట విద్యుత్ స్తంభాల్ని ఏర్పాటు చేయాలనుకుంటే తనపై దాడి చేశారని సర్పంచ్ పోలీసులకు […]

6 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పూర్తి.. గుజరాత్‌లో 68 లక్షల ఓటర్ల తొలగింపు

ఆరు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పూర్తయింది. ఆ వివరాలను ఎన్నికల కమిషన్ శనివారంనాడు విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల కంటే గుజరాత్‌లో అత్యధికంగా ఓటర్ల తొలగింపు చోటుచేసుకుంది. రికార్డు స్థాయిలో 68 లక్షల 12 వేల 711 మందిని జాబితా నుంచి తొలగించింది. ఎస్ఐర్ ప్రక్రియకు ముందు 5,08,43,436 మంది ఓటర్లు ఉండగా అది ప్రస్తుతం 4,40,30,725కు తగ్గింది.

సమిష్టి కృషి వల్లే పార్టీ ఓటింగ్ శాతం పెరిగింది: సిఎం రేవంత్

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మెజార్టీ 2 శాతమే తేడా అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అర్నెళ్ల తర్వాత జరిగిన ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ 4 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కుటుంబంలో 3 తరాలు దేశం కోసం ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీకి సొంత ఇళ్లు కూడా లేదని తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే కాంగ్రెస్‌ను కనుమరుగు […]

ఐదు లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే.. అరెస్ట్

కర్ణాటకలో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే చంద్రులామని లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. కాంట్రాక్టర్ల నుంచి రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు వలవేసి పట్టుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే చంద్రులామనిని అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటక,గడగ్ జిల్లాలో శనివారం జరిగింది. అరెస్టైన ఎమ్మెల్యే చంద్రులామని షిరాహట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గడగ్ జిల్లాలో నీటి పారుదల శాఖకు సంబంధించి చేపట్టిన ఒక పనికి అనుమతులు ఇచ్చి క్లియరెన్స్ రావాలంటే తనకు రూ.11 లక్షలు చెల్లించాల్సిందే అని […]

నేరగాళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలి :సిఎం చంద్రబాబు

ఎఐ సదస్సులో కాంగ్రెస్ తీరు ఆవవేదన కలిగించిందని, కాంగ్రెస్ తీరు దేశానికి మంచిది కాదని సూచించారు. కొందరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు కూడా లడ్డూ కల్తీ చేసి హెరిటేజ్ పేరు తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. తాను ప్రాణం పోయినా తప్పు చేయనని, లడ్డూ ప్రసాదానికి వాడింది నెయ్యే కాదని సిట్ చెప్పిందని తెలిపారు.  తప్పును పక్కన వాళ్లపై నెట్టే నీచులు కూడా ఉన్నారని, నేరగాళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని చంద్రబాబు నాయుడు […]

పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఊరట.. బెయిల్‌ ఇచ్చిన భివాండీ కోర్టు

పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఊరట లభించింది. మహారాష్ట్ర లోని భివాండీ కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. మహాత్మాగాంధీ హత్య వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని 2014లో రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆరెస్సెస్‌ కేసు వేసింది. మహారాష్ట్రలోని భివాండీ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఇవాళ జరిగిన విచారణకు రాహుల్‌గాంధీ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON